కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తాను అధికార ప్రతినిధిని కాబట్టి… తనకు సూపర్ పవర్స్ ఉన్నాయని…జీవీఎల్ నరిసంహారావు ఊహించుకుంటూ ఉంటారు. తనకు తానే ఓ విచారణ ఆధికారిగా ఫీలవుతున్నారు. ఐటీ, ఈడీ.. అన్నింటికి తానే సూపర్ బాస్ అనుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల నుంచి ఆయన.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ను టార్గెట్ చేశారు. సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు జరగినప్పటి నుంచి.. ఆయన సీఎం రమేష్‌పై రోజూ..ఎంతో కొంత బురద జల్లకపోతే… శాటిస్ ఫై కావడం లేదు. ఎందుకంటే… సీఎం రమేష్ మీసం మెలితిప్పి చేసిన సవాల్ జీవీఎల్ కళ్ల ముందు కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వతా సీఎం రమేష్ ఇంట్లో దొరికాయంటూ.. ఏవో గాలి కబుర్లు పోగేసి..ఇంగ్లిష్ పత్రికల్లో రాయించి.. దాన్నే తీసుకొచ్చి.. అదే పెద్ద సాక్ష్యమన్నట్లు చెప్పుకుని… సీఎం రమేష్ మీసం తీసేయించుకోవాలని… తనదైన స్టైల్లో విమర్శించి.. తన స్థాయి నిరూపించుకున్నారు.
అయితే.. గత మూడురోజులుగా.. జీవీఎల్ సీఎం రమేష్‌పై మరో రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అదేమిటంటే.. సీఎం రమేష్… కనిపించడం లేదేమిటి..?. ఆయన ఆంధ్రా మాల్యా అయ్యాడా..? అంటూ చెలరేగిపోతున్నారు. ప్రెస్ మీట్ ప్రారంభిస్తే.. ముందుగా.. సీఎం రమేష్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పారిపోయాడన్న అర్థంలో మాట్లాడుతూ వస్తున్నారు. అదేమిటో… ఐటీ దాడులు జరిగినంత మాత్రాన… రోజూ.. జీవీఎల్‌కు ఫోన్ చేసి హాజరు వేయించుకోవాలన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంది. అలా చేయకపోతే.. పారిపోయినట్లుగానే.. తీర్మానిస్తున్నట్లుగా.. జీవీఎల్ మాట్లాడటం ప్రారంభించారు. మొదటి రెండు రోజులు చూసిన సీఎం రమేష్.. నిన్న కడప లో జీవీఎల్ కు కౌంటర్ ఇచ్చారు.
ప్రొద్దుటూరులో… తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లలో ఉన్న సీఎం రమేష్.. జీవీల్ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. వైసీపీ, బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. ఐటీ దాడులకు భయపడి నేను దేశం విడిచివెళ్లినట్లు జీవీఎల్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను కేసులలో ఇరికించేలా బీజేపీ కుట్రలు పన్నుతోందని.. అయినా వెనక్కి తగ్గేది లేదన్నారు. మొత్తానికి జీవీఎల్… ఐటీ అధికారులను అడ్డు పెట్టుకుని… ఓ రేంజ్లో టీడీపీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలు మాత్రం.. గట్టిగానే వినిపిస్తున్నాయి.