‘సఖి’, ‘చెలి’, ‘యువ’… మాధవన్ నటించిన తమిళ సినిమాలు మ్యాగ్జిమమ్ తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి. హిట్టయ్యాయి. మాధవన్కి తెలుగులో చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ, ‘సవ్యసాచి’ ముందు వరకూ ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. ‘ఓం శాంతి’లో నటించినా… అది అతిథి పాత్రే. అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘సవ్యసాచి’లో విలన్‌గా నటించాడు. ఓ రకంగా ఈ సినిమాతో తెలుగులోకి మాధవన్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకు ముందు ‘యువ’లో మాధవన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమాలో పూర్తిస్థాయి విలన్ రోల్ చేశాడు.
‘సవ్యసాచి’లోని రోల్లో నటించడానికి ముందు ‘సవ్యసాచి’ టీమ్‌కి ఒక కండిషన్ పెట్టారు. దానికి సరేనంటేనే సినిమా చేస్తానని చెప్పార్ట! అదేంటంటే… ‘‘సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేయకూడదు’’ అని! అందుకు దర్శకుడు, నిర్మాతలు సరేనని ఒప్పుకున్నారు. సినిమా చేశారు. అందుకని సినిమాను తమిళంలో డబ్బింగ్ చేయలేదు. రెగ్యులర్ తెలుగు సినిమాల తరహాలో చెన్నై, తమిళనాడులో ఇతర ఏరియాల్లో ‘సవ్యసాచి’ తెలుగు వెర్షన్ విడుదల చేస్తున్నారు. సాధారణంగా పరభాషా నటీనటులు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తే… ఆ భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేయడం ద్వారా నిర్మాతలకు కొంత లాభం వస్తుంది. అయితే… ‘సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేస్తే, తను హీరోగా చేసే సినిమాలపై, కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని మాధవన్ భావించడంతో దర్శక నిర్మాతలు సరేనని అనక తప్పలేదు.