ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. ఎయిర్ పోర్టులో కోడి కత్తితో జగన్ పై దాడి తర్వతా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని… వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలతో.. విచారణ జరిపించాలని… డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రిని కూడా కలిశారు. ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూంటే.. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉందో అర్థం కావడం లేదు.
జగన్ అభిమాని అని గంటలోనే పోలీసులు ఎలా తేల్చారు..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఈ ఘటనపై కోర్టులో కేసు వేశారు. తమకు ధర్డ్ పార్టీ దర్యాప్తు కావాలని కోరారు. అంటే అర్థం ఏమిటి.. రాష్ట్ర విచారణ కాదు.. కేంద్ర విచారణ కాదు. ఈ రెండు కాకుండా.. ధర్డ్ పార్టీ విచారణ కావాలని కోర్టును కోరుతున్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి సెకండ్ పార్టీ అంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాలంటున్నారు. విచారణ ఎవరు జరపాలి.. రాష్ట్ర పోలీసులు జరిపాలి. లేకపోతే… కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపాలి. కోర్టులో ఏమన్నారు. తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు.. ధర్డ్ పార్టీ విచారణ కావాలని కోర్టుకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి… సీబీఐ విచారణ కావాలంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే.. వైసీపీకి.. రాష్ట్ర విచారణపై నమ్మకం లేదంటే… మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే… దాడి ఘటన జరిగిన తర్వాత గంటలోనే… డీజీపీ, సీఎం, మంత్రులు అందరూ.. దాడి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్పుకొచ్చారు. తమ నాయకునికి సింపతీ కోసమే.. చేశాడని తేల్చారు. ఆ తర్వాత విచారణ ప్రారంభించారు. సిట్ విచారణ మొదలు పెట్టక ముందే… వైసీపీ అభిమాని… తన నాయకుడిపై విచారణ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలా డీజీపీ మాట్లాడిన తర్వాత… విచారణ ఆ దిశగానే సాగుతుంది కదా…! అదే అనుమానాన్ని వైసీపీ వ్యక్తం చేస్తోంది.
ధర్డ్ పార్టీ అని మళ్లీ సీబీఐ దర్యాప్తు కావాలని ఎందుకంటున్నారు..?
వైసీపీ అనుమాన పడుతోంది కాబట్టి.. ధర్డ్ పార్టీ విచారణ అడగడం.. వైసీపీ వైపు నుంచి చూస్తే న్యాయమైన చర్యే. అయితే… విచారణ ఏ దశలో ఉన్నప్పుడైనానా వెళ్లవచ్చు. ముందే వెళ్లాల్సిన పని లేదు. కానీ అసలు.. విచారణ ప్రారంభం కాక ముందే వైసీపీ ధర్డ్ పార్టీ విచారణకు కోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్లు ఇలా ఉండగానే.. ఢిల్లీ వెళ్లి సీబీఐ విచారణ కావాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ కేంద్రం ఎవరు.. దాడి ఘటన జరిగిన తర్వాత.. ఐదు నుంచి పది నిమిషాల్లోనే… బీజేపీ నేతలు స్పందించారు. జీవీఎల్ నుంచి కన్నా వరకూ.. అందరూ… ఏపీ ప్రభుత్వ వైఫల్యం.. వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన విదించాలని డిమాండ్ చేశారు. అంటే అర్థం ఏమిటి.. కేంద్ర విచారణ సంస్థలు దర్యాప్తు జరిపితే.. ఇది ఏపీ ప్రభుత్వ వైఫల్యం.. విఫలమయ్యారు కాబట్టి.. చంద్రబాబును సిఫార్సు చేస్తారు. ఎందుకంటే… ఆల్రెడీ ముందే వాళ్లు చెప్పారు. అందువల్ల కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణపై టీడీపీకి నమ్మకం ఉండదు.
ఎవరు దర్యాప్తు చేసినా వ్యతిరేకంగా వస్తే ఒప్పుకుంటారా..?
చంద్రబాబు, లోకేష్ చేయించారనేది వైసీపీ ప్రధానమైన ఆరోపణ. మోడీనే వెనుకుండి ఈ డ్రామా ఆడిస్తున్నారని.. టీడీపీ ఆరోపణ. ఏపీ ప్రభుత్వం విపలమయిందని రాష్ట్ర పతి పాలన విధించాలనేది బీజేపీడిమాండ్. అంటే.. ఏపీ ప్రభుత్వం చేసే విచారణపై… వైసీపీకి నమ్మకం ఉండదు. కేంద్ర సంస్థ లు దర్యాప్తు జరిపితే.. ఏపీ ప్రభుత్వానికి నమ్మకం ఉండదు. వాస్తవానికి ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయలేదు. సీబీఐ దర్యాప్తు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. సుమోటోగా.. సీబీఐ కేసులు విచారించే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కోరకపోతే… సీబీఐ విచారణ జరిగే అవకాశం లేదు. అందువల్ల ధర్డ్ పార్టీ విచారణ కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు ధర్డ్ పార్టీ విచారణ జరిగినా.. ఏపీ పోలీసులో.. సీబీఐ అధికారులో చేయాలి. అందుకే… ఇప్పుడు ఏ విచారణ అయినా.. ఎంత నిష్పాక్షింగా జరిగినా.. ఎంత నిజాయితీగా జరిగినా.. ఎవరూ అంగీకరంచరు. తమకు అనుకూలంగా ఉంటేనే… అంగీకరిస్తారు. వ్యతిరేకంగా ఉంటే అంగీకరింతచరు. ఎన్నికలు జరిగే వరకూ ఇది ఇలా కొనసాగుతుంది.
పొలిటికల్ బ్లేమ్ గేమ్ మాత్రమేనా..?
రాజశేఖర్ రెడ్డి ప్రమాదం గురించి ఏదో వెబ్ సైట్ లో వస్తే.. దాన్ని పట్టుకుని జరిగిన హింసాకాడను కూడా చూశాం. ఇది ఎక్కడి దాకా పోయిందంటే…ఎవరు ఏం మాట్లాడినా… నువ్వే చేయించావేమో అన్నట్లుగా… వాదించే పరిస్థితికి ఏపీ రాజకీయం మారింది. దీన్ని ఎవరూ ఆపలేరు. పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఇది. సీబీఐ విచారణ కాదు.. వంద దేశాల దర్యాప్తు సంస్థ లను.. ఇంటర్ పోల్ తో కలిసి విచారణ జరిపినా… రాజకీయ పార్టీలు నమ్మవు. వారికి వ్యతిరేకంగా వస్తే అసలు యాక్సెప్ట్ చేయరు. ఇద్దరి పంచాయతీలో పనే లేని బీజేపీ కూడా… పని కల్పించుకుని… జోక్యం చేసుకుంది. అందుకే… ఏపీ ప్రజలారా.. ఇవేమీ పట్టించుకోకండి..పొలిటికల్ బ్లేమ్గేమ్ ఎప్పటికీ తేలదు. ఆరోపణలు చేసుకుంటూనే ఉంటారు.