గుండమ్మ కథని రీమేక్ చేయాలని ఎన్టీఆర్, నాగచైతన్య అనుకున్నారు. ఎన్టీఆర్ పాత్రకు జూనియర్, ఏఎన్నార్‌గా నాగచైతన్య రీప్లేస్ చేసేస్తారు. మరి గుండమ్మగా ఎవరు నటిస్తారు? ఇక్కడే ఈ రీమేక్ ఆగిపోయింది. ‘గుండమ్మ లేదు కాబట్టి.. మేం ఆ సినిమా చేయలేకపోయాం’ అని ఈ హీరోలిద్దరూ చేతులెత్తేశారు. గుండమ్మగా సూరేకాంతం చూపించిన ఇంపాక్ట్ అదీ. ఆ పాత్రకు రీప్లేస్మెంట్ లేదు.. రాదు.
సరిగ్గా ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లోనూ ‘గుండమ్మ’ పాత్ర అవసరమైంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే.. ఆయన సమకాలీన నటీనటుల్ని చూపించాలి. అందరూ కాకపోయినా.. ఉద్దండుల్ని తెరపైనే కాసేపయినా చూపించాలి. గుండమ్మ కోసం చిత్రబృందం కూడా గాలించింది. కానీ సూరేకాంతంని రీప్లేస్ చేయడం వారి వల్ల కాలేదు. అందుకే సూరేకాంతం పాత్రని లేకుండా చేశారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో గుండమ్మ కథకు సంబంధించిన ఓ సీన్‌ని షూట్ చేశారు. కానీ అందులో తెలివిగా సూరేకాంతం పాత్రని స్కిప్ చేశారు. సూరేకాంతం లేని షాట్‌ని బాలకృష్ణ, సుమంత్‌లపై తెరకెక్కించారు. కాంతారావు పాత్ర కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించదని టాక్. మోహన్‌బాబు పాత్ర కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో ఉండకపోవొచ్చు.