అక్కినేని హీరోల సినిమా.. అనగానే నాగార్జున హ్యాండు తప్పనిసరి. తన సినిమా అనేసరికి కొంత చూసీ చూడనట్టు వదిలేసినా… చైతూ, అఖిల్ సినిమా లకు మాత్రం పూర్తి స్థాయి జోక్యం ఉంటూనే ఉంటుంది. చాలా సినిమాల్ని ఎడిట్ రూమ్‌లో కూర్చుని, రిపేర్లు చేశాడు నాగ్. ఆ రిపేర్లు కొన్ని సార్లు ఫలితాన్ని ఇచ్చాయి. కొన్నిసార్లు బెడసి కొట్టాయి. `శైలజా రెడ్డి అల్లుడు`కీ నాగ్ హ్యాండు పడింది. అయితే `సవ్యసాచి`కి మాత్రం పూర్తిగా దర్శక నిర్మాతలపైనే భరోసా వదిలేశాడు నాగ్.
`సవ్యసాచి` విషయంలో నాగ్ జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. `శైలజా రెడ్డి అల్లుడు` ఫ్లాప్ అయ్యింది. చైతూ కెరీర్ కి అది దెబ్బే. ఈ సరిస్థితుల్లో… `సవ్యసాచి` కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాడనుకున్నారు. కానీ.. నాగ్ మాత్రం `సవ్యసాచి`పై దృష్టి పెట్టలేదు. ఇదివరకెప్పుడూ ఎడిట్ వెర్షన్ చూసిన నాగ్ కొన్ని సలహాలు ఇచ్చాడట. అంతకు మించి… తన జోక్యం లేదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘సవ్యసాచి’ సినిమా కూడా ఇప్పటి వరకూ నాగ్ చూడలేదని, అక్కడక్కడ కొన్ని ముక్కలు చూసి వదిలేశాడని తెలుస్తోంది. ఇదంతా నాగ్‌కి మైత్రీ మూవీస్‌పై, దర్శకుడిపై ఉన్న నమ్మకమా? లేదంటే ఇలాంటి క్లిష్టమైన కథల్లో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమం అనుకున్నాడా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ”కొన్ని సినిమాల ఫలితాన్ని మనం జడ్జ్ చేయలేం.. నీ దారిలో నువ్వు తీసుకుంటూ వెళ్లిపో” అని చందూకి చెప్పాడట నాగ్. అందుకే… నాగ్ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా కనిపించలేదని తెలుస్తోంది.