`నీదీ నాదీ ఒకే కథ` సినిమాతో అందరినీ ఆకట్టుకన్నాడు వేణు ఉడుగుల. ఆ వెంటనే సాయి పల్లవికి ఓ కథ చెప్పి `ఓకే` చేయించుకున్నాడు. ఈ కథ కోసం చాలా రోజుల నుంచి కథానాయకుడ్ని అన్వేషిస్తున్నాడు వేణు. ఎట్టకేలకు రానా దొరికాడు. ఈ సినిమాలో నటించడానికి రానా ముందుకు రావడంతో కాంబినేషన్ సెట్టయ్యింది. `పడి పడి లేచె మనసు` నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. స్క్రిప్టు ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం దానికి మెరుగులు దిద్దుతున్నారు. రానా కాల్షీట్లు, సాయి పల్లవి కాల్షీట్లు సర్దుబాటు అయిన వెంటనే.. షూటింగ్ మొదలెడతారు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలపై సెటైర్లు వేస్తూ… `నీదీ నాదీ ఒకే కథ` తయారు చేశాడు వేణు. ఈసారీ ఓ సామాజిక అంశాన్ని సృశిస్తున్నాడని తెలుస్తోంది. రానా కంటే సాయి పల్లవి పాత్రకే వెయిటేజీ ఎక్కువని, అందుకే ముందు సాయి పల్లవికి కథ చెప్పి ఒప్పించాడని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.