నాడు ఢిల్లీలో అధికారంలో ఉండి అహంకారాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో ఈ రోజు బీజేపీ ఉంది. అందుకే టీడీపీ … ఇప్పుడు.. అప్పట్లో యుద్ధం చేసిన పార్టీతో చేతులు కలిపింది. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ భేటీ తర్వాత… రాజకీయాల్లో .. టీడీపీ అంటే పడని వాళ్లు… వైసీపీ, బీజేపీ నేతలు… ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని.. క్షోభకు గురవుతున్నారు. అంత వరకూ ఓకే కానీ.. అసలు రాహుల్ – చంద్రబాబును కలిపింది ఎవరు..? అంటే.. కచ్చితంగా… ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరే అందరూ చెబుతున్నారు. ఆయన ఎలా కలుపుతాడనే డౌట్ చాలా మందికి రావొచ్చు.. కానీ కలిసే పరిస్థితులు మాత్రం కల్పించింది ఆయనే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం సపోర్ట్ కావాల్సిందేనన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గొంతెమ్మ కోరికలు కోరినా.. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. కానీ ఆ మెతకదనాన్నే వారు .. ఆసరా తీసుకుని చెలరేగిపోయారు. విభజన హామీలు అమలు చేయకపోగా.. త్రిబుల గేమ్ ప్రారంభించారు. ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే.. చంద్రబాబు పేరు లేకపోయినా.. ఆర్థిక ప్రయోజనాలకు ఒప్పుకున్నారు. కానీ బీజేపీ మాత్రం.. చంద్రబాబును ఇలా ట్రాప్‌లో పడేసి… వైసీపీ, జనసేనలతో.. ప్రత్యేకహోదా ఉద్యమాలు ప్రారంభింపచేసింది. చంద్రబాబు బీజేపీ ప్లాన్ అర్థం చేసుకుని.. బీజేపీకి జెల్లకొట్టి.. బయటకు వచ్చి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తాను హైజాక్ చేసేసరికి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా బీజేపీకి అర్థమైపోయింది. అప్పట్నుంచి వైసీపీ, జనసేనతో… హోదా గురించి సైలెంట్‌గా ఉండేలా చేసినా… చంద్రబాబు మాత్రం వదిలి పెట్టడం లేదు. విభజన హామీలపై కాస్త తగ్గుతారేమోనని.. సీబీఐ, ఐటీ, ఈడీలతో బెదిరిస్తే.. చంద్రబాబు దీన్ని మరింత చాలెంజ్ గా తీసుకున్నారు. ఆ పరిస్థితి ఢిల్లీలో బీజేపీయేతర కూటమి దిశగా సాగింది.
నిజానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కానీ.. కలవాలని కానీ చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి పరిస్థితులు బీజేపీనే తెచ్చి పెట్టింది. తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు అనుకున్నారు. కానీ బీజేపీ పడనీయలేదు. అదే సమయంలో ప్రత్యేకహోదా విషయంలో రాహుల్ గాంధీ ఇస్తున్న హామీ ప్రజల్లోకి వెళ్లింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను శిక్షించాం.. నమ్మకద్రోహం చేసిన బీజేపీని ఏం చేయాలన్న భావన పెరిగిపోయింది. ఫలితంగా… దశాబ్దాలుగా రాజకీయ శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. విభజన హామీలు అమలు చేస్తే.. చంద్రబాబుకు… ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఒక వేళ వెళ్లినా… ఆయన రాజకీయస్వార్థం కోసం వెళ్లారని అనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం.. చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారనే ప్రజలు అనుకుంటున్నారు.