చంద్రబాబు రాహుల్ గాంధీ తో కలవడం పూర్తయింది. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖరారైంది. ఇది పార్టీలో ఎటువంటి సమీకరణలకు దారి తీస్తుంది అన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే, ప్రజలు తమని బట్టలూడదీసి కొడతారని, అలాంటి పొత్తు చాలా దుర్మార్గం అని, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎన్నటికీ అలాంటి పని చేయరని వ్యాఖ్యానించిన తెలుగుదేశం మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు ఇప్పుడు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..
Click here for : కాంగ్రెస్ తో పొత్తు ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం మంత్రులు
“కాంగ్రెస్, ప్రధాని మోదీ, వైసీపీ అధ్యక్షుడు జగన్ మాకు బద్ధశత్రువులు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తేలేదు. అలా కాంగ్రెస్ పార్టీ తో తమ పార్టీ అధినేత గనక పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటాను ” అని తీవ్ర వ్యాఖ్యలు గతంలోోో చేసి ఉన్నారు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. అలాగేే మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఇదే తరహా తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ” దేశాన్ని దోచుకుని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే ప్రజలు బట్టలూడదీసి తంతాారు. ఎన్టీఆర్ కాంగ్రె్‌సను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు, రాష్ట్ర ప్రజలు క్షమించరు, మా అధినేత చంద్రబాబు అటువంటి తప్పు చేస్తారని నేను భావించడం లేదు. ” – ఇవీ మంత్రిిి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలోో చేసి వ్యాఖ్యలు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రెండు వ్యాఖ్యలే హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తును అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన ఈ మంత్రులు ఇప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. “అభిప్రాయాలు మార్చుకోని వాడు పొలిటిషనే కాదు” అని గురజాడ రాసినట్టు, వీరిద్దరు కూడా ఇప్పుడు- దేశ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం తమ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని మాట మారుస్తారా లేక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ స్వరాన్ని వినిపిస్తారా అన్నది వేచి చూడాలి.