‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ముగిసిన వెంటనే… వి.ఐ ఆనంద్ సినిమా మొదలెట్టేస్తాడు రవితేజ. నభా నటేషా కథానాయికగా నటించబోతోంది. ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల అవుతుంది. ‘డిస్కో రాజా’ అనే పేరు పరిశీలనలో ఉంది. దాన్నే ఖరారు చేసే అవకాశాలున్నాయి. అన్నట్టు… ఈ సినిమాలో రవితేజ డిస్కో డాన్సర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈరోజుల్లో డిస్కో డాన్సర్లు ఎక్కడున్నారబ్బా? అనుకోకండి. ఇది 1980 నేపథ్యంలో జరిగే కథ. ఆరోజుల్లో డిస్కో డాన్సర్లు భలే ఫ్యామస్. ఇప్పట్లో రాక్ స్టార్లా. ‘డిస్కో రాజా’ 1980 .. ఆ కాలంలో జరిగే కథ. ‘రంగస్థలం’ లా అన్నమాట. రవితేజ డిస్కో డాన్సర్ కాబట్టే.. ఈ సినిమాకి `డిస్కో రాజా` అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీపావళికి టైటిల్‌పై కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. పోస్టర్‌పై డిస్కో డాన్సర్ గెటప్‌లోనే రవితేజ కనిపిస్తాడని సమాచారం. రవితేజ నటించిన ‘అమర్అక్బర్ ఆంటోనీ’ ఈనెల 16న విడుదల అవుతుంది. ఆ తరవాత డిస్కో రాజా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.