తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి కూడలిలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ “నన్ను ముఖ్యమంత్రిని చేయండి” అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ పవన్ ఏమన్నాడంటే
“నన్ను ముఖ్యమంత్రిని చేయండి. బాధ్యతగా పనిచేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి. నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని యువత కోరుకుంటోంది. . రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే జనసేనతోపాటు సీపీఎం, సీపీఐలను పిలవండి. హోదాపై మాట్లాడదాం. ఉమ్మడిగా పోరాడదాం. ప్రధాని మోదీతో గొడవపెట్టుకునేంత నైతిక బలం తెదేపాకు లేదు. ఆ శక్తి జనసేనకే ఉంది తూర్పుగోదావరి జిల్లాలోని వంతాడలో లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు సాగుతున్నాయి. విశాఖ మన్యంలోనూ ఇదే సమస్య ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తెదేపా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను నక్సలైట్లు చంపేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరా ప్రభుత్వాన్ని నడిపేది” .
ఇవీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. గతంలో అభిమానులు సీఎం సీఎం అని అరిస్తేనే, వారించినటువంటి పవన్ కళ్యాణ్, ఇటీవల అభిమానులను సీఎం సీఎం అని నినాదాలు చేయమని తానే కోరుతున్నారు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాలు బాగానే వంటబట్టించుకున్నారు.