“యూనిటీ ఆఫ్ స్టాట్యూ” పేరుతో నరేంద్రమోడీ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాని లక్ష్యం ఏమిటంటే.. ప్రధానంగా… గుజరాత్లో టూరిజం అభివృద్ధి చేసుకోవడం. రాజకీయంగా.. పటేల్ అనే వ్యక్తిని గొప్ప వ్యక్తిగా చూపి.. ఆయన ఖ్యాతిని బీజేపీ ఖాతాలో వేసుకోవడం. నిజానికి ఆయనకి బీజేపీ పొడ కూడా గిట్టదు. ఆరెస్సెస్‌ను బ్యాన్ చేయమన్న నేత. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. అయినా సరే… కాంగ్రెస్ … గాంధీని ఏకంగా.. ఇంటి పేరుగా చేసుకున్నారన్న కారణంగా.. పటేల్ ను బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే “యూనిటీ ఆఫ్ స్టాట్యూ” ఆలోచన మోడీ మనసులో 2010లో మెదిలింది. అప్పటికి గుజరాత్ ప్రధానే. ఎంత ప్రచారం చేసుకున్నా పాత తక్కును పంపమని అడిగినా.. ఎవరూ పంపలేదు. దాంతో.. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయారు. కానీ ఎప్పుడైనా నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యారో.. అప్పుడే… ఆ విగ్రహానికి్ మహర్దశ పట్టింది. శరవేగంగా.. పూర్తయింది. చైనా తయారీ విగ్రహాన్ని… నర్మదానది ఒడ్డున అసెంబ్లింగ్ చేశారు. మొత్తానికి బిల్లు రూ. 3వేల కోట్లయింది. ఈ బిల్లంతా ఎవరు భరించారు..?
ఇంకెవరు భరించారు…! మొత్తం గుజరాత్ ప్రభుత్వమే భరించింది. కేంద్రం చాలా కొద్దిగానే సాయం చేసింది.. మొత్తం గుజరాత్ ప్రభుత్వమేనని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి గుజరాత్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా.. ఈ విగ్రహానికి ఖర్చు పెట్టలేదనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పటేల్ విగ్రహానికి ఖర్చు పెట్టిన నిధులన్నీ.. ప్రభుత్వ రంగ సంస్థలు .. ముఖ్యంగా.. ఆయిల్ కంపెనీ… తమ సీఎస్ఆర్ ఫండ్స్ కింద… చందాలుగా ఇచ్చాయట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద.. ప్రతీ కార్పొరేట్ సంస్థ తమ ఆదాయంలో రెండు శాతం… సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ నిధులను…..” వాలంటరీ”గా… ఈ విగ్రహాలకు ఇచ్చేలా.. కేంద్రం చేసిందని తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 900 కోట్లు, ఓఎన్జీసీ రూ. 500 కోట్లు, భారత్ పెట్రోలియం రూ. 250 కోట్లు, ఆయిల్ ఇండియా కార్పొరేషన్ రూ. 250 కోట్లు, గెయిల్ రూ. 250 కోట్లు, పవర్ గ్రిడ్ రూ. 125 కోట్లు, గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రూ. 100 కోట్లు, ఇంజినీర్స్ ఇండియా, పెట్రోనెట్ ఇండియా లాంటి కంపెనీలు రూ. యాభై కోట్లు చందాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే .. రూ. 200 కోట్లు కేటాయించారు. అంటే.. మొత్తం ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి..సీఎస్ఆర్ ఫండ్స్ రూపంలో వసూలు చేశారు. ఈ మొత్తం ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో బాదినవే. అదీ కూడా.. ఒక్క గుజరాత్ లో ప్రాజెక్ట్ కోసం వెచ్చించినవే. అంబానీలు కానీ.. ఆదానీలు కానీ… ఈ ప్రాజెక్ట్ కోసం.. ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు.. గుజరాత్ ప్రభుత్వం తీసుకోలేదు.
ఆయిల్ కంపెనీలకు నష్టాల సాకు చెప్పి… పన్నులు విపరీతంగా పెంచిన కేంద్రం… అంతర్జాతీయ మార్కెట్లో ధరల తగ్గుదలతో వచ్చిన లాభాలు కూడా తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో.. ఆయా ఆయిల్ కంపెనీలు పేదల కోసం.. సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను పటేల్ విగ్రహం కోసం గుజరాత్‌కు పంపించారు. దేశంలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో… కేంద్రం ప్రారంభించిన పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. బీజేపీ ఆఫీసును.. పధ్నాలుగు నెలల్లో.. పటేల్ విగ్రహాన్ని మూడేళ్లలో పూర్తి చేశారు. అదీ కూడా.. దేశ ప్రజల పన్నులతో.. గుజరాత్లో… కట్టించారు. పటేల్ విగ్రహానికి సంబంధించి.. మరాఠా పత్రిక లోక్ సత్తా.. ఈ వివరాలన్నింటినీ బయటపెట్టింది.