Dev telugu teaser review
కార్తి నటించిన తమిళ సినిమాలు తెలుగులో రావడం ఆనవాయితీగా మారిపోయింది. ఎందుకంటే… కార్తికి తెలుగులో ఆ స్థాయిలో మార్కెట్ ఉంది. ఇప్పుడు `దేవ్` కూడా తెలుగులో విడుదల అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. రజత్ దర్శకత్వం వహించాడు. ఠాగూర్ మధు తెలుగులో అందిస్తున్నారు. టీజర్ విడుదలైంది. కార్తి డైలాగులతోనే టీజర్ నిండిపోయింది. ఇందులో హీరో ఎటిట్యూడ్ చూపించారు. `బతకడానికి ఎన్నో దారులున్నాయ్…` అంటూ.. తన లక్ష్యం, జీవితం మొత్తం టీజర్లో చూపించారు. మొత్తానికి సాహసాలంటే ఇష్టపడే యువకుడి కథ ఇది. ఇందులో కార్తి రేసర్‌గా కనిపించనున్నాడు. ఇలాంటి పాత్ర చేయడం కార్తికి ఇదే తొలిసారి. యాక్షన్‌ని బాగా దట్టించినట్టు కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. హారీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. తెలుగులోనే కాదు, తమిళంలోనూ కార్తికి ఈమధ్య విజయాలు దక్కడం లేదు. `ఖాకీ` ఒక్కటే కాస్త నిలబడింది. `దేవ్`ని కూడా విజయవంతమైన చిత్రాల సరసన నిలబెట్టాలన్నది కార్తి తాపత్రయం. ఏం జరుగుందో మరి.