కేసీఆర్ మేనల్లుడు, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు పరిస్థితి…అటూఇటూ కాకుండా పోయేలా ఉంది. తాను సిద్ధిపేటకు వెళ్లపోయినా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్న హరీష్ రావు.. ఇప్పుడు పూర్తిగా గజ్వేల్‌లో మకాం వేశారు. కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గెలిపించడానికి కాదు.. ఓడించడానికి అంటూ… కాంగ్రెస్ అభ్యర్తి ప్రతాప్ రెడ్డి… కొన్ని వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన ఫైరయిపోయారు. ఆ తర్వాత వరంగల్ టీడీపీ నేత.. రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా.. ఇంచు మించు ఇలాంటి ఆరోపణల చేశారు. దాంతో… తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకపడిన హరీష్‌రావు… గజ్వేల్‌లోనే మకాం వేసి… ప్రతాప్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తానని సవాల్ చేశారు. దాని ప్రకారం.. ఆయన ఇరవై నాలుగు గంటలూ.. గజ్వేల్నే ఉన్నారు.
హరీష్ రావు.. పరిస్థితి చూసి.. కాంగ్రెస్ ట్రాప్‌లో పడిపోయారని… ఆ పార్టీ నేతలు.. అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. హరీష్ రావు గొప్ప… రాజకీయ వ్యూహకర్త. ఆయన బాధ్యతలు తీసుకున్న చోట ఎలాగైనా గెలుపు తెప్పించి పెడతారు. అందుకే.. ఆయనను వీలైనన్ని తక్కువ నియోజకవర్గాలకు పరిమితమయ్యేలా చూడాలని కాంగ్రెస్ స్కెచ్ వేసిందని… దానికి తగ్గట్లుగానే ఆరోపణలు చేశారని చెబుతున్నారు. వారు అుకున్నట్లుగా సవాల్ గా తీసుకున్న హరీష్ రావు.. గజ్వేల్కే పరిమిమతవుతున్నారు. నిజానికి.. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు.. మహబాబ్ నగర్ జిల్లాలోని కొన్నికీలక స్థానాల బాధ్యతను.. కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. అందులో గజ్వేల్ ఉంది.. కొడంగల్ కూడా ఉంది. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు ఎంత ముఖ్యమో.. కొడంగల్‌లో.. రేవంత్ రెడ్డి ఓటమి కూడా.. హరీష్‌కు అంతే ముఖ్యం.
కొడంగల్ బాధ్యతను.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే తీసుకున్నారు. అప్పట్లో రేవంత్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరగడంతో ఉప ఎన్నిక వస్తుందన్న అంచనాతో హరీష్ రావు ఆపరేషన్ ప్రారంభించారు. ఆర్థికంగా బలంగా ఉన్నారని పట్నం బ్రదర్స్‌ను రంగంలోకి దింపారు. కొన్నాళ్ల కిందటి వరకూ.. కొడంగల్‌పై దృష్టి పెట్టిన హరీష్ రావుకు.. ఇప్పుడు దాని గురించి పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. గజ్వేల్ లోనే మకాం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర నియోజకవర్గాలపై సైతం దృష్టి పెట్టలేకపోతున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇదే ఎఫెక్ట్ కోరుకున్నదంటున్నారు. ఓ రకంగా కేసీఆర్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారు.. గజ్వేల్ వదిలి వెళ్తే.. మామను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారంటారు.. ఓ వేళ అక్కడే ఉంటే.. తనకు కేసీఆర్ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితికి వచ్చినట్లవుతుంది. ఈ పరిస్థితి చూస్తే.. హరీష్ రావును.. కాంగ్రెస్ పార్టీ బాగానే ట్రాప్ చేసిందనుకోవాలేమో..?