సోషల్ మీడియాలో మిస్టర్ బీన్‌కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఓ బ్యాంక్‌లో రెండు కౌంటర్లు ఉంటాయి. జనం తక్కువ ఉన్నారు కదా.. అని బీన్ ఓ ఓ లైన్లో నుంచుంటారు.. కానీ ఆ లైన్ ఎప్పటికీ కదలదు. ఈ లోపు పొడుగ్గా ఉన్న లైన్… బాగా తగ్గిపోతుంది. వెంటనే మనసు మార్చుకుని బీన్ పక్క లైన్‌కి వచ్చేస్తాడు. కానీ అప్పుడే అది కూడా ఆగిపోతుంది. పక్క కౌంటర్ దగ్గర.. ఒక్కరే ఉంటాడు. దాంతో మళ్లీ ఆ కౌంటర్‌కి వెళ్లిపోతాడు. కానీ బ్యాడ్ లక్… ఒక్కడితోనే కౌంటర్ మూసేసి వెళ్లిపోతాడు. ఊసూరోమంటూ.. మళ్లీ ఈ లైన్‌కి వచ్చే సరికి అది కూడా.. క్లోజ్ అయిపోతుంది. దాంతో పని కాదు. ఏదో ఒక్క లైన్‌కి స్టిక్ అయిపోయి ఉంటే… మిస్టర్ బీన్‌కి క్లారిటీ ఉండేది.. కానీ.. లేని అవకాశాల్ని అందుకునే ప్రయత్నం చేయడంతో రెంటికి చెడ్డ రేవడిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అంతే ఉంది.
విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేయడంతో… చిన్న గాయం అయింది. ఓ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి కాబట్టి.. దాన్ని వైసీపీ ప్రణాళిక ప్రకారం.. ఢిల్లీ స్థాయి రాజకీయం చేయాలనుకుంది. స్క్రీన్ ప్లే హైదరాబాద్ కు వచ్చిన తర్వాతే ప్రారంభించడంతో సమస్య వచ్చింది. అప్పటికే గాయం.. ఘటన… దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని తేలడంతో… సీరియస్ నెస్ పోయింది. ఆ తర్వాత అయినా గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సిన వైసీపీ.. పూర్తిగా చంద్రబాబును బాధ్యుడ్ని చేసేందుకు… వన్ బై వన్ సిరీస్ కార్యక్రమాలు ప్లాన్ చేసింది. ఏపీ నుంచి ఢిల్లీ వరకూ ఇవి ఉన్నాయి. అయితే…వాళ్లు ఈ రాజకీయాన్ని రెండు, మూడు రోజులకే మర్చిపోవాల్సి వచ్చింది. టీడీపీ ట్రాప్ లో పడిపోవాల్సి వచ్చింది.
చంద్రబాబు జాతీయ స్థాయి మహాకూటమికి.. ఢిల్లీలో ప్లాన్ చేసి… రాహుల్ గాంధీని కలవడంతో… కోడి కత్తిని.. పూర్తిగా మర్చిపోయిన వైసీపీ… ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటూ… ఆవేదన చెందడం ప్రారంభించారు. దీంతో.. వైసీపీ స్టాండ్ అనూహ్యంగా మారిపోయింది. కింది స్థాయి నుంచి పై వరకూ.. చివరికి జగన్ మీడియా కూడా.. అదే పాట అందుకోవడంతో.. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. రెండు రోజుల తర్వాత తాము చేసిన తప్పేమిటో తెలుసుకుని… ఆ టాపిక్‌ను వదిలేసి..మళ్లీ కోడి కత్తి దగ్గరకు వచ్చారు. సోమవారం అంతా.. జగన్ మీడియా.. మళ్లీ… జగన్ పై దాడి వార్తలతో నింపేసింది. రోజా లాంటి నేతలు వచ్చి.. మళ్లీ ఎ – వన్ చంద్రబాబేనని ప్రకటనలు ప్రారంభించారు. హర్షవర్థన్ అనే శ్రీనివాసరావు పని చేసే క్యాంటీన్ ఓనర్ పేరు చివర చౌదరి అని తగిలించి కొత్త ప్రయత్నం ప్రారంభించారు. కానీ… కానీ.. అప్పటికే.. విషయం డైవర్ట్ అయిపోయింది.. సీరియస్ నెస్ వైసీపీ నేతలే తగ్గించుకున్నారు. ఇక పట్టిచుకునేవారు ఎవరు ఉంటారు..?