భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తానని… అదీ కూడా.. 30 రోజుల్లోనే అని … అమిత్ షాకు మాటిచ్చాని.. కొత్తగా ఆధ్యాత్మికం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన. .. పరిపూర్ణానంద పదే పదే చెప్పుకొస్తున్నారు. పరిపూర్ణానంద కాన్ఫిడెన్స్ చూసి బీజేపీ నేతలు బిత్తర పోతున్నారు. తానే నెక్ట్స్ సీఎం అన్నంతగా.. ఆయన హడావుడి ఉండటమే దీనికి కారణం. ఇతర పార్టీలేవీ దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు కానీ… పరిపూర్ణానంద మాత్రం.. ఏ మాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. అయితే హఠాత్తుగా.. ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ఆయన ఉపదేశం ఉంది. దాన్ని చూసి.. అందరూ .. 30 రోజుల్లో సీఎం కావడం ఇంత సులువా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అది ఎంతగా సంచలనం సృష్టించిందంటే… టీఆర్ఎస్ నేతలు .. నేరుగా ఆ వీడియోను.. ఉపదేశాన్ని ఈసీ దగ్గరకు తీసుకెళ్లి … కంప్లైంట్ రాసిచ్చేశారు. ఇంతకూ అందులో ఏమంటుందంటే… తలా రెండు వందలు ఇస్తే చాలా వేల కొద్దీ ఓట్లు వచ్చి పడతాయని సలహా ఇచ్చేస్తున్నారు.
తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్న పరిపూర్ణానంద.. రోడ్ షోలు కూడా చేస్తున్నారు. రోడ్ షో.. అంటే… పెద్ద పెద్ద నేతలు వచ్చినప్పుడు చుట్టూ జనాలు ఉంటారేమో కానీ.. పరిపూర్ణానంద వస్తే ఎవరుంటారు.. ? ఓపెన్ టాప్ జీప్ పై నిలబడి.. పక్కనున్న బీజేపీ నేతతో మాట్లాడుతూ.. రోడ్డుపై ఎవరైనా కనబడితే.. ఓ నమస్కారం పెట్టే రోడ్ షోను రెండు రోజుల కిందట చేశారు. నమస్కారం పెట్టడానికి రోడ్డు మీద మనుషులెవరూ కనిపించని సందర్భంలో… పక్కననున్న రాజకీయ శిష్య పరమాణువుకు.. గెలుపు సూత్రాన్ని హిత బోధ చేశారు. రూ. 200 కాన్సెప్ట్ ను విడమర్చి చెప్పారు. సహజంగా స్వామి ప్రతి అడుగును.. ప్రతి మాటను.. రికార్డు చేసుకోవడానికి సొంత టీమ్‌ను పెట్టుకున్నారు. అలా… వాళ్లు రికార్డు చేసుకున్నారు. అయితే… స్వామి వారి రూ. 2 వందల ప్రవచానికి మంచి ప్రాచుర్యం రావాలని… రికార్డు చేసిన వాళ్లు అనుకున్నారేమో కానీ.. దాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. స్వామి వారి రాజకీయ వేషం బయటకు వచ్చేసింది.
స్వామి వారిపై.. ఈసీకి ఫిర్యాదు వెళ్లడంతో… ఆయనకు చెందిన భారత్ టుడే చానల్ భుజాలు తడుముకుంది. దుష్ప్రచారం అంటూ.. చాలా సేపు ప్రోగ్రాం నడిపించారు. కానీ ఆ వీడియో అబద్దమని.. అందులో స్వామి వారు అలా అనలేదేని చెప్పుకోలేకపోయారు. కానీ… ప్రచారం చేయడం వల్ల ఆయన ఇమేజ్ ను దెబ్బతీయాలనుకుంటున్నారని మాత్రం ఆరోపించేశారు. మొత్తానికి పరిపూర్ణానంత.. చాలా వేగంగా పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిపోతున్నారు.