సమంత లేటెస్ట్ సినిమా.. యూటర్న్. తన కెరీర్‌లో సమంత తొలిసారి ఓ రీమేక్ సినిమాలో నటించింది. అది ఆశించిన ఫలితం రాలేదు. సమంత మరోసారి రీమేక్ కథపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది సమంత. నాగశౌర్య కథానాయకుడిగా నటించే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇదో కొరియన్ సినిమాకి రీమేక్. ఆ సినిమానే ‘మిస్ గ్రానీ’. ఓ నాయినమ్మ- ఆమె మనవరాలు మధ్య నడిచే కథ ఇది. మనవరాలి పాత్రలో సమంత కనిపిస్తుంది.చ నాయినమ్మ పాత్రలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. కొరియన్ సినిమాని అఫీషియల్‌గా రీమేక్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. ఇందుకు సంబంధించి.. రైట్స్ కూడా అధికారికంగానే కొనుగోలు చేశారు. `కల్యాణ వైభోగమే` తరవాత నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మహిళా దర్శకులంతా చెల్లాచెదురైపోతున్న ఈరోజుల్లో నందిని రెడ్డి నిలబడాలంటే.. ఓ హిట్టు కొట్టాల్సిందే. మరి ఈ కొరియన్ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.