ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రంగు మారుతోంది. పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో.. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు తగ్గించారు. కానీ.. తాము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని.. ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నారు. అయితే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం.. జగన్‌తో కలిసి… పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని.. వారి వెనుక బీజేపీ ఉందని… ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పవన్, జగన్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్నది .. ఇప్పుడు ఓ పెద్ద హాట్ టాపిక్ అయింది.
చంద్రబాబు ఓడించాలంటే జగన్, పవన్ కలవాలా..?
తెలంగాణలో మహాకూటమి ఏర్పడితే తమకు నష్టం కాబట్టి… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియా కూడా.. మహాకూటమి లుకలుకల్ని పెద్దవిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇలాగే.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా.. జగన్, పవన్ కలిస్తే.. తమకు నష్టం కనుక.. వాళ్లిద్దరూ ఏ మాత్రం కలిసే అవకాశం ఉన్నా.. దాన్ని మొగ్గలోనే… తెంపేయాలనేది.. టీడీపీ వ్యూహం. అలాంటి పరిస్థితి రాకుండా చేయాలనేది.. టీడీపీ నేతల లక్ష్యం. ఎదుకంటే.. జగన్ , పవన్ కలిస్తే.. డెఫినెట్‌గా.. రాజకీయ వాతావరణం.. చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతుంది. చంద్రబాబు ఓడిపోవాలంటే.. జగన్, పవన్ కలసి పోటీ చేయాలనే మాట చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో కూడా కలిశారు కనుక.. అది కూడా.. ఒకటో.. రెండో శాతం.. యాడ్ అయితే.. చంద్రబాబు మరింత కంఫర్టబుల్ పొజిషన్‌కు వెళ్తారు. అందువల్ల.. చంద్రబాబును ఓడించాలంటే.. కచ్చితంగా.. జగన్, పవన్ కలవాలని యాంటీ చంద్రబాబు సెక్షన్ బలమైన కోరిక. ఇది.. యాంటీ చంద్రబాబు ఓటర్ కానీ.. పొలిటికల్ పార్టీస్.. ఏదైనా కానీ.. వారి కోరిక ఇదే.
జగన్, పవన్‌లను బీజేపీ నేతలు కలుపుతారా..?
బీజేపీ నేతలు ఇప్పుడు టీడీపీ అధినేత మీద కోపంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు.. మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలోనే పోరాటం ప్రారంభించారు కాబట్టి… చంద్రబాబును రాష్ట్రంలో ఓడిస్తే… ఆయన క్రెడిబులిటీ పోతుందనేది.. చాలా మంది ఉద్దేశం. అందుకే.. టీడీపీపై కచ్చితమైన టార్గెట్ పెట్టుకుని బీజేపీ పని చేస్తోంది. ఈ విషయంలో మోడీ, అమిత్ షా పని తీరు వేరు. చంద్రబాబును ఓడించేందుకు ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది. చంద్రబాబును ఓడించేందుకు.. జగన్, పవన్ ను కలపడానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధమే. అయితే.. చేయగలుగుతుందా..? చేస్తుందా..? బీజేపీ చెప్పినట్లే చేస్తుందా..? అన్నది రాజకీయవర్గాల్లో ఉన్న సందేహం. చంద్రబాబు ఓడిపోవాలనుకునేవారు.. జగన్, పవన్ కలవాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గెలవాలనుకునేవారు.. కలవకూడదని అనుకుంటున్నారు. అందుకే టీడీపీ వాళ్లు.. పదే పదే.. జగన్, పవన్ కలుస్తారని… ప్రచారం చేస్తున్నారు. .. వాళ్ల వెనుక బీజేపీ ఉందని ప్రచారం చేస్తున్నారు. వాళ్లిద్దరూ కలవడానికి అవకాశం లేని రాజకీయ వాతావరణాన్ని సృష్టించడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది.
పొత్తులు ఉండవని పవన్ పదే పదే ఎందుకు చెబుతున్నారు..?
ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా.. జగన్, పవన్ కలిస్తే.. ఇదంతా.. ఏపీని దెబ్బతీయడానికి బీజేపీ పన్నిన కుట్ర అన్న పద్దతిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. టీడీపీ సిద్ధమయ్యేలా రాజకీయ వ్యూహం ఖరారు చేసుకుంది. దీని వల్ల పవన్ కల్యాణ్.. పదే పదే చెప్పాల్సి వస్తోంది. తాను ఓంటరిగా పోటీ చేస్తానని పదే పదే చెబుతుంది. వామపక్షాలతో పొత్తు ఉంటుందనే ప్రచారం ఉంది కదా.. అన్న సందేహం కొంత మందిలో ఉంది. అయితే జనసేన వర్గాలు చెబుతున్నదేమిటంటే.. తమకు పొత్తులు ఉండవని.. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటన.. జగన్ ను ఉద్దేశించి చేసినవి. జగన్ తో పొత్తులు ఉండవు అని చెప్పడం కన్నా.. అసలు మాకెవరితో పొత్తులు ఉండవని చెబుతున్నారు. వామపక్షాలతో పొత్తులు ఉంటాయని.. కానీ.. ఉండవనికానీ.. ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి… ఎవరితోనూ పొత్తులు ఉండవని చెబుతున్నారని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.
జగన్‌కు వేరేవారిని కలుపుకునే మనస్థత్వం ఉందా..?
జగన్మోహన్ రెడ్డి… వేరే వాళ్లని కలుపుకోవడానికి ఆసక్తి చూపడం కూడా కష్టమే. ఆయన స్వభావరీత్యా ఆయన ఏమనుకుంటారంటే… తాను ఒంటరిగా గెలుస్తానంటారు. నిజంగా ఆయన గత ఎన్నికల సమయంలోనే ఎత్తుగడలు సరిగ్గా వేసి ఉంటే.. బీజేపీతో కలిసినా… వామపక్షాలతో కలిసినా… రెండు శాతం ఓట్లు పెరిగేది. గెలిచి ఉండేవారు. వామపక్షాల ఓట్లు.. కచ్చితంగా ట్రాన్స్ ఫర్ అవుతాయి. అయినా జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోవడం లేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వామపక్షాలతో పొత్తుల కోసం ప్రయత్నం చేయడమే లేదు. రెండు శాతం, మూడు శాతం కలసి వచ్చినా… ప్రయోజనమే. పొత్తులు చిన్న పార్టీలతో పెట్టుకున్నా ప్రయోజనమే. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ వైఖరి లేదు. పైగా పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగత విమర్శలు చేసి టార్గెట్ చేస్తున్నారు. ఎవరినో కలుపుకోవాలని… జగన్ అనుకునే అవకాశం లేదు. ఇటీవలి కాలంలోజగన్ పై పవన్ కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి చంద్రబాబునాయుడ్ని విమర్శిస్తున్నారు కాబట్టి.. ఇద్దరూ కలుస్తారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..!
కానీ రాజకీయాల్లో.. కలుస్తారా..? లేదా..? అన్న గ్యారంటీని ఇవ్వలేం. ఎందుకంటే… గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత దారుణంగా విమర్శించిన చంద్రబాబు… ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎవరైనా ఊహించగలరా..?. బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని.. చాలా మందికి నమ్మకం లేదు. బీజేపీతో ఎప్పుడైనా తెగ దెంపులు చేసుకోవచ్చని.. అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌తో కలుస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ..కలిశారు. దీన్ని బట్టి చూస్తే.. రాజకీయాల్లో కలవడానికి ప్రాతపదిక ఏదీ లేదు. లోపలేమైనా జరుగుతుందో లేదో చెప్పలేం. ఏపీలో బీజేపీతో ఎవరూ పొత్తు పెట్టుకోరు. పెట్టుకుంటే.. అది రాజకీయ సైూసైడ్ ఎటెంప్ట్ అవుతుంది. ఎన్నికల తర్వాత ఎవరైనా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమో కానీ.. ఎన్నికల ముందుసాధ్యం కాదు. అందుకే.. తనకు కొన్ని సీట్లు రావాలంటే.. జగన్ తో కలవాలని… తను అుకున్న సీట్లు రావాలంటే.. జగన్ కానీ అనుకుంటే.. కలవొచ్చు. అయితే.. కలుస్తారన్న వాతారవణం కానీ… టీడీపీ ఆరోపిస్తున్నట్లు కలిశారన్న పరిస్థితి కానీ లేదని చెప్పుకోచవ్చు.