2014 ఎన్నికల సమయంలో.. నరేంద్రమోడీ అంటే.. ఓ బాహుబలి. ఆయన రూపాయికి పది డాలర్లు వచ్చేలా ఆర్థిక వ్యవస్థని బలపరుస్తారని చెప్పారు. అమెరికన్లు ఇండియాకు ఉద్యోగాల కోసం వస్తారని ప్రచారం చేశారు. అబ్బో చెప్పుకుంటే.. మోడీ ప్రధాని అవగానే… దేశంలో సూపర్ పవర్ అయిపోవడం ఖాయమని సోషల్ మీడియాలో ఉదరగొట్టారు. తీరా నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది. రూపాయి .. డాలర్ కు దూరంగా పరుగులు పెడుతోంది. అస్తవ్యస్థ నిర్ణయాలతో … దేశం తిరోగమనంలో ఉంది. కానీ.. వేల కోట్లు పెట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నాం. మరి ఇండియా అమెరికా అయ్యేదెప్పుడు..?. అదెంత సేపు.. మోడీ తలుచుకుంటే.. క్షణాల్లో చేయగలరు. ఆయన శిష్యుడు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్… చేసి చూపిస్తున్నారు. ఇది మోడీ దాగా వస్తే… అమెరికా అయిపోతుంది. ఇంతకీ యోగి యూపీలో అంతగా ఏం చేస్తున్నారో తెలుసా..? పేర్లు మారుస్తున్నారు… !
దీపావళికి గుడ్ న్యూస్ ఉంటుందని.. యూపీ ప్రజలకు మూడు రోజులుగా.. యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొస్తున్నారు. ప్రజలు కనీసం.. సీఎం స్వీట్లు పంచుతాడేమోనని ఆశగా ఎదురు చూశారు. చివరికి ఆయన ఓ న్యూస్ చెప్పారు. అదే స్వీట్ అనుకోమన్నారు. అదేమిటంటే.. ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చారట. ఈ జిల్లాలోనే అయోధ్య ఉది. అయోధ్య మనకు గర్వకారణమని, ఈ పేరు శ్రీరాముడితో ముడిపడిందని, నేటి నుంచి ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా వ్యవహరిస్తామని ఘనంగా ప్రకటించారు. అంతేనా ఆ స్వీట్లు.. ఇంంకా ఉన్నాయి.. శ్రీరాముడి పేరిట విమానాశ్రయం, దశరధుడి పేరుతో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారట. ఇవి లెటెస్టే.. అంతకు ముందు ఇలాంటివి కొన్ని చేశారు. మొఘల్‌సరై రైల్వే జంక్షన్ పేరును దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్చి పడేశారు. బరేలి, ఆగ్రా విమనాశ్రాయాల పేర్లు మార్చడానికి రెడీ అయిపోయింది. రైల్వే స్టేషన్లు .. విమానాశ్రయాల పేర్లే కాదు.. ఏకంగా చరిత్రలో నిలిచిపోయిన నగరాల పేర్లు కూడా మార్చేస్తున్నారు. కాశీ అంటే.. అందరికీ అలహాబాదే గుర్తొస్తోంది. ఇప్పుడీ పేరుతో యూపీలో నగరం లేదు. ఆ నగరం పేరు ప్రయాగ్‌రాజ్‌గా మార్చి పడేశారు. దీనికి బీజేపీ మార్క్ మోడీ చెప్పే చరిత్రలు యోగి చెప్పుకొస్తున్నారు. అసలు అలహాబాద్‌కు ప్రయాగ్ అనే పేరు ఉందని తెలుస్తోంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన సమయంలో పేరు మార్చారని.. తేల్చారు. ఇప్పుడు… ఆ ఆక్బర్ చేసిన తప్పును..ఈ యోగి సరిదిద్దారన్నమాట.
రామాలయం పేరుతో రాజకీయాలు చేసి.. అటు యూపీలో.. ఇటు కేంద్రంలో పూర్తి స్థాయి.. తిరుగులేని ఆధిక్యం సాధించినా.. అయోధ్యలో ఓ చిన్న ఇటుక కూడా రామాలయం కోసం పెట్టలేదని… హిందూత్వ వాదులంతా.. దండెత్తడానికి రెడీ అవుతుంటే… బీజేపీ నేతలు.. ఈ పేర్ల మార్పు సెంటిమెంట్ ను ప్రారంభించారు. రేపు ఎవరైనా.. ఇండియాను అమెరికా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తే.. ఆ రెండో.. ఇండియా పేరును అమెరికాగా మార్చేసి.. అందరి నోళ్లూ .. .మూసేయించగల తెలివి తేటలు.. మోడీ నేతృత్వంలోని బీజేపీకి ఉంది. అందుకే… మోడీ పరివార్ అల్టిమేట్..!