ఏపీలోనో.. తెలంగాణలోనే… టీడీపీ ఒక్క వార్డు మెంబర్ స్థానంలో ఓడిపోతే.. అది సాక్షి పేపర్లో కచ్చితంగా బ్యానర్ అవుతుంది. అవకపోతే.. ఆశ్చర్యపోవాలి. అదే వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా… ఆ వార్తకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అది వాళ్ల స్ట్రాటజీ. అంత వరకూ బాగానే ఉంటుది. కానీ.. బీజేపీ ఓడిపోతే… ఎందుకు .. అదో చిన్న విషయం అన్నట్లుగా దాచి పెట్టడం..?. కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం పాలైంది. జాతీయ మీడియాలన్నీ… ప్రముఖంగా గంటల తరబడి ఫలితాలు ప్రకటించాయి. రౌండ్ల వారీ.. ఫలితాలు ఇచ్చాయి. బీజేపీకి ఆ దుస్థితి ఎందుకొచ్చిందో… కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ఎందుకు సక్సెస్ అయిందో ఎనాలసిస్ ఇచ్చారు. తెలుగు చానళ్లు కూడా.. ఉత్సాహంగా కవరేజీ ఇచ్చాయి.కానీ ఒక్క సాక్షి మీడియా మాత్రం… అదేదో మన దేశానికి సంబంధం లేదన్నట్లుగా… ఇక్కడెవరికీ ఆసక్తి లేని వార్తన్నట్లుగా కవర్ చేసింది. ఒక్క టీవీ కవరేజీలోనే కాదు.. పేపర్లోనూ అంతే.. అంటీ ముట్టనట్లుగా… రిజల్ట్ ప్రకటించి వదిలేసింది. అతి చిన్న వార్త ప్రచురించింది. మిగిలిన అన్ని పత్రికలూ బ్యానర్ కథనాలు రాశాయి. పైగా రాతల్లోనూ… నిరాశ అంటూ… తను బాధపడిపోయింది.
నిజానికి కర్ణాటక ఉపఎన్నికలు.. దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ఎలా వర్కవుట్ అవుతుందనేదానికి.. ఫస్ట్ టెస్ట్.. ఈ ఉపఎన్నికలే. దేశంలో ఓ కొత్త కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో.. ఈ ఫలితాలు… ఆ ప్రయత్నాలను.. తుంచడమో.. పెంచడమో చేయడం ఖాయం. అందుకే.. అందరూ ఆసక్తి చూపించారు. బహుశా.. సాక్షి కూడా చూపించి ఉండేదేమో..? భారతీయ జనతా పార్టీ కనీసం బళ్లారిలో గెలిచినా… హడావుడి చేసి ఉండేదమో..? కానీ.. జగన్ కు దేవుడిచ్చిన అన్నయ్య ఇలాకాలో పట్టుకోల్పోవడం… సాక్షికి నచ్చినట్లు లేదు. బీజేపీ ఓడిపోవడం.. అసలు సహించినట్లు లేరు.
కొన్నాళ్ల కిందట కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ.. నేరుగా బీజేపీకే మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ అభ్యర్థుల కోసం.. వైసీపీ నేతలు సీమ జిల్లాల నుంచి వెళ్లి పని చేశారు. ముఖ్యంగా.. గాలి జనార్ధన్ రెడ్డి వర్గీయుల కోసం… కొన్ని వందల మంది బళ్లారి ఏరియాకు వెళ్లారు. ఇక… యడ్యూరప్పతో.. విజయసాయిరెడ్డి.. ఓ హోటల్లో కూర్చుని లెక్కలు చూసుకుంటున్న ఫోటోలు హైలెట్ అయ్యాయి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీజేపీకే… జగన్ మీడియా మద్దతు పలికినట్లుగా కథనాలు ప్రచురించింది. ఆ అనుబందంతో ఏమో కానీ.. ఇప్పుడు.. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం తట్టుకోలేకపోయింది. ఎక్కువగా కవరేజీ ఇవ్వకుండా.. కవర్ చేసుకుంది. బీజేపీతో జగన్ బంధమేమిటని.. అందరూ ప్రశ్నిస్తూంటారు కానీ… జగన్ మీడియా మాత్రం.. ఇలాంటి కథనాలతో.. వైసీపీ – బీజేపీ మధ్య బంధమేమిటో.. ఇట్టే చెప్పేస్తూ ఉంటుంది.