ఆంధ్రప్రదేశ్లో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు బ్రేకింగ్న్యూస్లు హడావుడి చేశాయి. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న వర్శిటీకి రూ.834 కోట్లు ఇస్తారని కూడా చెప్పుకొచ్చారు. నిజానికి ఇదో పెద్ద ఫార్స్ అన్న విషయం.. గిరిజన వర్శిటీ విషయంలో కేంద్రం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను చూస్తే అర్థమవైపోతుంది. ఎందుకంటే.. బడ్జెట్లోఈ యూనివర్శిటీ కోసం కేటాయించింది.. రూ. 10 కోట్లు మాత్రమే. అసలు… గిరిజన వర్శిటీ ఏర్పాటు చేయాలంటే.. పార్లమెంట్లో చట్టం చేయాలని. కానీ నాలుగున్నరేళ్లపాటు.. కేంద్రం దీన్ని పట్టించుకోలేదు.
ఆంధ్రప్రదేశ్రాష్ట్ర పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 93, షెడ్యూల్ 13 (3)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గిరిజన యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్, విజయనగరం జిల్లాలలో స్థలసేకరణ కూడా చేశాయి. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంటులో ప్రత్యేకంగా చట్టం చేయాలి. కాని నేటికీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. రెండవది కేంద్ర ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించాలి. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 1100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కేంద్ర నిపుణుల బృందం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అదీ ఈ సంవత్సరం బడ్జెట్లో మాత్రమే రూ.10 కోట్లు కేటాయించింది. అయితే ఆ నిధులను కూడా విడుదల చేయలేదు. చట్టం చేస్తేనే.. నిధులు విడుదల అవుతాయి.
కానీ కేంద్రం ఇంత వరకూ.. సింపుల్గా అయిపోయే చట్ట సవరణ మాత్రం చేయడం లేదు. బడ్జెట్ లో పది కోట్లు కేటాయించి.. ఏకంగా కేబినెట్ భేటీలో మాత్రం.. రూ. 834 కోట్లు ఇస్తున్నట్లు చెప్పుకోవడం.. పబ్లిసిటీ కోసం తప్ప..మరో దాని కోసం… కాదని.. వివిద పార్టీల నేతలు మండి పడుతున్నారు.