Vinaya Vidheya Rama Teaser
బోయపాటి శ్రీను ఏం మారలేదు. టైటిల్.. హీరో తప్ప – అతని జోరు, తీరు ఏమాత్రం మారలేదు. హీరోని తను చూపించే విధానం సేమ్ టూ సేమ్! `వినయ విధేయ రామ` టీజర్ చూసినవాళ్లంతా ఇదే మాట అంటారు. హీరోయిజాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టే దర్శకుడు బోయపాటి శ్రీను. `వినయ విధేయ రామ` టీజర్లో కూడా అదే కనిపించింది. ప్రతీషాటులోనూ, ఫ్రేమ్‌లోనూ హీరోయిజం 70 ఎమ్.ఎమ్‌లో కనిపించింది. టైటిల్ లో ఉన్న సాఫ్ట్ నెస్.. టీజర్లో ఏమాత్రం లేదు. అంతకు మించిన యాక్షన్ థమాకాతో సాగిపోయింది టీజర్. `రామ్ కొ.. ణి.. ద…ల` అన్నప్పుడు చరణ్‌ని చూస్తే మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేస్తాయి. వెనుక ఓ గుంపు .. ఎదురుగా హీరో నడుచుకుంటూ వెళ్లడం, చుట్టూ రౌడీలు, వాళ్ల మధ్యలో హీరో చేతిలో ఆయుధం.. ఇవీ బోయపాటి శ్రీను సినిమాల్లో కనిపించే రొటీన్ దృశ్యాలు. అవి ఈ టీజర్లోనూ రిపీట్ అయ్యాయి. మొత్తానికి మాస్‌కి మరోసారి పండగలాంటి సినిమాని అందివ్వబోతున్నానని టీజర్‌తో చెప్పేశాడు బోయపాటి. కాకపోతే టైటిల్‌కీ, ఫస్ట్ లుక్‌కీ అస్సలు సంబంధమే లేదేంటి? అని ఆశ్చర్యపోయిన వాళ్లంతా.. ఇప్పుడు టీజర్ చూసి ఆ ఆశ్చర్యాన్ని కంటిన్యూ చేస్తారంతే!