జాతీయస్థాయిలో బిజెపీయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల కారణంగా.. జాతీయ స్థాయి నేతలు అమరావతికి వచ్చి రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. రాహుల్ గాంధీకి ప్రస్తుతం రైట్ హ్యాండ్‌గా వ్యవహరిస్తున్న అశోక్ గెహ్లాట్.. నేడు అమరావతికి వస్తున్నారు. చంద్రబాబుతో సమావేసమవుతున్నారు. ఆయన కూటమికి సంబంధించి కొత్త ఐడియాలను తీసుకొస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతండటంతో డిసెంబర్ మొదటివారం లోపు బిజెపియేతర కూటమి పక్షాలన్నీ కలిపి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో బహిరంగ సభలు నిర్వహించాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తోంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఈ సభలు నిర్వహిస్తే ప్రత్యామ్నాయ కూటమిపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో పాటు, కాంగ్రెస్ పార్టీకి, మిత్ర పక్షాలకు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని, తటస్థంగా ఉన్న ఓటర్లు మొగ్గే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు ముందు ఉంచి చర్చించాలని రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్ ను తన దూతగా పంపుతున్నారు.
మరో వైపు తెలంగాణా ఎన్నికల సందర్భంగా మహాకూటమిగా ఏర్పడిన నాలుగు పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటు, అభ్యర్ధుల ఎంపిక, ప్రచార సరళిపై కూడా గెహ్లాట్ చంద్రబాబుతో చర్చించనున్నారు. టీజెఎస్, సిపిఐ నేతలు మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా తమకు ఇచ్చిన 14 సీట్లలో కొన్ని నియోజకవర్గాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. వీటన్నింటిపై ఫోన్ లో చర్చించడం కాకుండా నేరుగా చంద్రబాబు తో మాట్లాడాలని రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్ ను తన దూతగా చంద్రబాబు వద్దకు పంపారు. చంద్రబాబుతో అశోక్ గెహ్లాట్ చర్చల ప్రక్రియ ముగిసిన తరువాతనే మహాకూటమి అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణతో నాలుగు రాష్ట్రాల్లో ప్రచార సరళి ఎలా ఉండాలనే అంశంపై కూడా అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో చర్చించనున్నారు. మహాకూటమిలో నాలుగు పక్షాలు కలిపి బహిరంగసభలు నిర్వహించడమా..లేక నాలుగు సభలు అందరూ కలిసి నిర్వహంచి, భాగస్వామ్య పక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎవరికి వారు ప్రచారం చేసుకోవడమా అనే అంశంపై కూడా గెహ్లాట్ చర్చలు జరపనున్నారు. వీటన్నింటి పై ఫోన్ లో కాకుండా చంద్రబాబుతో నేరుగా చర్చలు జరిపి తన అభిప్రాయాలను వివరించాలని రాహుల్ గాంధీ ఆయనను అమరావతికి పంపుతున్నారు .