తెలంగాణ రాష్ట్ర సమితి ..ఎన్నికల వ్యూహం కాస్తంత గందరగోళంగానే ఉంది. గ్రేటర్‌లో.. సీమాంధ్రులను మచ్చిక చేసుకోవడానికి… రకరకల కబుర్లు చెబుతున్నారు. మిగతా చోట్ల.. ఆంధ్రుల పెత్తనం అంటూ… రెచ్చగొట్టేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. గ్రేటర్‌లో ఆంధ్రుల మద్దతు పొందడానికి చేస్తున్న ప్రయత్నాలే కాస్త తేడాగా ఉన్నాయి. నాగార్జున దగ్గర్నుంచి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ఏ ఆంధ్రా సినీ యాక్టర్ కానీ.. టెక్నిషియన్ కానీ సిద్ధపడితే.. వారితో ప్రకటనలు ఇప్పించేస్తున్నారు. మోహన్ బాబుతోనూ.. చెప్పించుకున్నారు. చివరికి పోసాని కృష్ణమురళిని కూడా వదిలి పెట్టలేదు. టీఆర్ఎస్ మళ్లీ గెలవాలని వారందరితో చెప్పించుకున్నారు. వీరికి… తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లలో ఉన్న పలుకుబడి ఎంతో కానీ… తెలంగాణ వాదుల్లో మాత్రం.. వీరిపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం.. నమస్తే తెలంగాణ పత్రికలో.. ఓ ఫుల్ పేజీ మొత్తం .. సినీ, కళా రంగాలకు చెందిన వారు..టీఆర్ఎస్ మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు కథనం రాసుకున్నారు. అందులో మొట్టమొదటగా నాగార్జున ఉన్నారు. తెలంగాణ వాదులకు..నాగార్జున పేరు చెప్పగానే.. మొదటగా… మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటరే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే… ఆ కన్వెన్షన్ సెంటర్ చెరువును కబ్జా చేసిందని.. గతంలో జీహెచ్‌ఎంసీ నిర్ణయించి కూలదోయడానికి ముహుర్తం కూడా పెట్టేసింది. తర్వాత ఏం జరిగిందో కానీ అది పక్కకుపోయింది. కేటీఆర్‌తో… నాగార్జున కుటుంబం సన్నిహితంగా వ్యవహరిస్తోంది. అన్నీ ఇలాంటి ఖాతాలే ఉన్నాయి. మోహన్ బాబు.. తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలు అప్పట్లో రేపిన అలజడి అంతా ఇంతా కాదు. ఆయన కూడా ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటే.. పెద్ద అక్షరాలతో వేసుకున్నారు. ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే పోసాని కృష్ణమురళి మాటల్ని కూడా… గొప్పగా వేసుకున్నారు.
వీరి మద్దతు వల్ల టీఆర్ఎస్‌కు కొత్తగా ఒరిగేదేమీ లేదు కానీ… తెలంగాణ వాదుల్లో మాత్రం.. ఆంధ్రోళ్ల కోసమే… టీఆర్ఎస్ పని చేసిందని … వారికి మేళ్లు చేసిందని… ఇలాంటి మద్దతు ప్రకటనల ద్వారా.. తెలంగాణ వాదులకు అర్థమైపోతోంది. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన ఘటనలు వారి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. మద్దతు ప్రకటిస్తే.. ఎంత చేసినా… సైలెంట్‌గా ఉండిపోయి.. వ్యతిరేకిస్తే మాత్రం.. ఎంతకైనా తెగించే తత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఉండటంతో.. చాలా మంది సినీ తారలు ఎందుకొచ్చిన గొడవన్నట్లు మద్దతు ప్రకటనలు చేసేస్తున్నారు. ఇది… టీఆర్ఎస్‌కే మైనస్‌లా మారే ప్రమాదం కనిపిస్తోంది.