Kavacham teaser
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ పాత్ర పోషించిన చిత్రం `కవచం`. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ కథానాయిక. మెహరీన్ మరో నాయికగా కనిపించనుంది. టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. ఓ రకంగా ఇది మినీ ట్రైలర్‌లా ఉంది. అరవై సెకన్ల పాటు సాగిన టీజర్లో… యాక్షన్, మేకింగ్ పరంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పేసింది చిత్రబృందం. అనగనగా ఓ రాజు లేని రాజ్యంలో, రాకుమార్తె లాంటి కథానాయిక. తనకు రక్షణగా… కవచంలా నిలిచే పోలీస్ ఆఫీసర్. ఇదీ… `కవచం` కథ. దాన్ని ఓ థ్రిల్లర్‌లా మలిచాడు దర్శకుడు. నిర్మాణ పరంగా, నటీనటుల పరంగా తెరపై నిండుదనం కనిపిస్తోంది. `పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా పనిచేయాలి` అనే డైలాగ్‌ని బట్టి – ఇది ఎత్తుకు పై ఎత్తుల కథలా అనిపిస్తోంది. బెల్లంకొండ లుక్స్, పర్సనాలిటీ… ఇవన్నీ పోలీస్ పాత్రకు అచ్చుగుద్దినట్టు సరిపోయాయి. ఖాకీ దుస్తుల్లో రాయల్‌గా కనిపిస్తున్నాడు. డిసెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. `సాక్ష్యం` ఫ్లాప్ తో కాస్త డీలా పడిన బెల్లంకొండకు ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆ లక్షణాలు టీజర్లో పుష్కలంగా కనిపించడం శుభపరిణామం.