తెలంగాణ ఎన్నికలలో టిఆర్ఎస్ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేసింది. ఇదే రక్షణ కలిగిన మీరు పార్టీలను కలుపుకొని పోతాం అని చెప్పింది. తెలుగుదేశం , సిపిఐ , టీజేఎస్ లతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. సీట్ల సర్దుబాటు కంటే లక్ష్యమే ముఖ్యమని ప్రగల్భాలు పలికింది. కానీ తీరా సీట్ల జాబితా విడుదల చేసే సరికి, కాంగ్రెస్ మార్కు రాజకీయం బయటపడింది. మిత్ర ధర్మం పాటించకుండా కాంగ్రెస్ జాబితా తయారు చేసింది. 65 స్థానాలకు అర్ధరాత్రి జాబితా ప్రకటించింది కాంగ్రెస్.
ముఖ్యంగా సిపిఐ, టీజేఎస్ పార్టీలకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. ఆ పార్టీలు కోరుతున్న స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేసింది. రామగుండం, స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్ స్థానాలను సిపిఐ కోరింది. అయితే సిపిఐ కోరిన ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అలాగే ఇంటి పార్టీ అభ్యర్థికి కూడా నకిరేకల్ లో మొండిచేయి చూపింది కాంగ్రెస్. ఇంటి పార్టీ అభ్యర్థి మహా కూటమి లో చేరిన తర్వాత అడిగినది ఒకే ఒక్క సీటు. ఆ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. అయితే ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం రెండు టికెట్లు లభించాయి. దాదాపు నెలన్నర పైగా కూటమి నడిపి, చివరకు సీట్ల వద్దకు వచ్చేసరికి, మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ సీట్లు ప్రకటించడంపై, మిత్ర పక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే మిత్ర పక్షాల నుండి విమర్శలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లా టిడిపి అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తిరుగుబాటు బావుటా ఎగురవేసి, గెలిచే సీట్ల నా వదులుకోవడమే నా త్యాగం చేయడం అంటే అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా, అర్ధరాత్రి జాబితా ప్రకటన తర్వాత మిత్ర పక్షాలు కంగుతిన్న మాట వాస్తవం. మరి అవి ఇప్పుడు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.