అమర్ అక్బర్ ఆంటోనీతో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలన్న పట్టుదలతో ఉన్న శ్రీనువైట్ల.. ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ కలలు కంటున్నాడు. `అమర్ అక్బర్..`నే హిందీలోనూ రీమేక్ చేయాలనుకుంటున్నాడు శ్రీను. ”ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. హిట్ అయితే గనుక దీన్ని హిందీలోనూ రీమేక్ చేయాలనుకుంటున్నా” అన్నాడు శ్రీను. ”ఇది వరకు ఢీ, దూకుడు సినిమాల్ని బాలీవుడ్ లో తీయమని ఆఫర్లు వచ్చాయి. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం అలాంటి అవకాశం వదులుకోను. `అమర్ అక్బర్ ఆంటోనీ` హిందీ రైట్స్ నా దగ్గరే ఉంచుకున్నాను. తెలుగులో ఆడితే మాత్రం బాలీవుడ్లోనూ ఈ సినిమా చేస్తా“ అని క్లారిటీగా చెప్పేశాడు శ్రీనువైట్ల. రవితేజ – ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.