దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా.. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సరిహద్దులు ఉన్న ఈ రాష్ట్రంలో .. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజునే.. తొలి దశ పోలింగ్ ముగిసింది. మామూలుగా రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తే… ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో … కాంగ్రెస్ సులభంగా గెలవగలిగే.. రాష్ట్రంగా.. చత్తీస్ఘడ్ ఉండాల్సింది. అయితే ఇప్పుడు రాజస్థాన్‌లో.. కాంగ్రెస్ సలువుగా గెలుస్తుందని చెబుతున్నారు. కానీ చత్తీస్‌ఘడ్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు.
చత్తీస్‌ఘడ్‌లో ఎవరు గెలిచిన ఒక్క శాతం ఓట్ల తేడానే..!
భారతీయ జనతా పార్టీ చత్తీస్‌ఘడ్‌లో.. వరుసగా గెలుస్తూ వస్తోంది. 2003, 2008, 2013 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. రమణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత కాలం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి.. ఆయనపై… ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉండటం సహజం. దాని వల్ల బీజేపీ బలం తగ్గింది. అందుకే.. ఈ ప్రభుత్వ వ్యతిరేకతను.. రాజకీయంగా లాభం పొందడానికి ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ.. చత్తీస్ ఘడ్లో కాంగ్రెస్ పార్టీపై.. కేవలం ఒకటి కంటే తక్కువ శాతం ఓట్ల తేడాతో గెలిచింది. అంతకు ముందు… 2008లోనూ అంతే తక్కువ తేడాతో గెలిచింది. బీజేపీ గెలిచిన చోట్ల.. చాలా తక్కువ తేడానే ఉంది. 90 సీట్లు ఉన్న చత్తీస్ ఘడ్ అసెంబ్లీలో సగం సీట్లు.. ఏ పార్టీ గెలిచినప్పటికి.. ఓట్ల తేడా కేవలం ఐదు వేల లోపే ఉంటోంది.
కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలు చేసిందా..?
ఇంత తక్కువ మెజార్టీతో… బీజేపీ బయట పడుతున్నప్పటికీ.. పదిహేనేళ్ల అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీని ఓడించడానికి.. కాంగ్రెస్ పార్టీ పెద్దగా కష్టపడాల్సిన పని ఉండేది కాదు. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే బీజేపీ ఎత్తుగడలు ఉపయోగపడ్డాయి. బీఎస్పీ కాంగ్రెస్‌తో కలవకుండా… బీజేపీ చేయగలిగింది. మాయావతిపై ఉన్న కేసులు కారణం కావొచ్చు..మరో కారణం కావొచ్చు..మాయావతి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుని ఉంటే.. బీజేపీ కచ్చితంగా ఓడిపోయి ఉండేది. దీనికి తోడు.. మాజీ కాంగ్రెస్ నేత.. అజిత్ జోగి.. ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. పదిహేనేళ్ల క్రితం.. కాంగ్రెస్ పార్టీ తరపున… అజిత్ జోగి..చత్తీస్ ఘడ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇది చాలదన్నట్లుగా.. బీఎస్పీతో… అజిత్ జోగి పొత్తు పెట్టుకున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న.. గిరిజన నేతలు.. బీజేపీలో చేరారు. ఈ పరిణామాల వల్ల గెలవడానికి అవకాశం ఉన్న రాష్ట్రంలో.. ఓటమికి అంచున ఉన్నట్లు అంచనా వేయవచ్చు.
అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉంటేనే కాంగ్రెస్‌కు చాన్స్..!
ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. పదిహేనేళ్ల భారతీయ జనతా పార్టీ పాలనపై… ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉండి… ఈ సారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటే మాత్రం… కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా.. ఓట్లు పొలరేషన్ జరిగిదే… ప్రత్యామ్నాయంగా.. కాంగ్రెస్ కు కన్సాలిడేట్ జరిగితే .. ఉంటుంది. అయితే.. ఆ పరిస్థితి ఉందాలేదా అన్న ముఖ్యం. ప్రస్తుతం… బీజేపీ కంటే.. బలంగా.. కాంగ్రెస్ పార్టీకి అక్కడ సవాళ్లు కనిపిస్తున్నాయి. అజిత్ జోగి సొంత పార్టీ పెట్టుకోవడం.. మాయావతి పొత్తు పెట్టుకోకపోవడం.. సీనియర్ గిరిజన నేతలు పార్టీని వీడటం లాంటివి.. వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పోను… పదిహేనేళ్ల బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండి… ప్రత్యమ్నాయంగా.. ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు ఉంటే మాత్రం… గెలుపును ఎవరూ ఆపలేరు.