జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద.. ఒక్క సారిగా కోపం ముంచుకు వచ్చింది. పోరాటయాత్ర ప్రారంభించినప్పటి నుంచి స్పీచ్‌లో 90 శాతం.. చంద్రబాబును విమర్శించడానికి… మిగతా పది శాతం మాత్రం… జగన్‌కు సాఫ్ట్‌గా సలహాలివ్వడానికి కేటాయించి.. జనసేనాధినేత.. తొలి సారి జగన్‌పై టెంపర్ చూపించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పోరాటయాత్రలో ప్రసంగించిన ఆయన… తన టెంపర్ మొత్తం… జగన్మోహన్ రెడ్డి మీదే చూపించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి… ఓ మీడియా సమావేశంలో.. నాలుగు వేళ్లు చూపించి.. పవన్ కల్యాణ్.. కార్లు మార్చినట్లు.. పెళ్లాలను మారుస్తాడని విమర్శించారు. దాన్ని గుర్తు చేసుకుని.. ఒంటికి కారం పూసుకున్నట్లుగా ఊగిపోయారు.
తనను వ్యక్తిగతంగా విమర్శించడం కాదని… అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలను తూర్పారపడితే.. అప్పుడు మగతనం బయటకు వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లకుండా తనను వ్యక్తిగతంగా విమర్శించడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లి సీఎంను నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు వైసీపీకి ఇచ్చారని… కానీ ప్రతిపక్ష నాయకుడు బుగ్గలు నిమరడం తప్ప ప్రశ్నించడంలేదన్నారు. బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటామన్న వైసీపీ.. రెల్లికులస్థుల భూములను ఆ పార్టీ నేత దోచుకున్నా పట్టించుకున్న నాథుడు లేడన్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీలేని తానే ఇన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం కనుక్కుంటున్నానని.. వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో విరుచుకుపడలేదు. చాలా రోజుల తర్వాత… ఆ విషయం ఇప్పుడే తెలిసినట్లు.. ఎందుకు పవన్ కల్యాణ్ ఊగిపోయాడో.. జనసేన నేతలకు అర్థం కాలేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డిని మాత్రం.. అంత తీవ్ర స్థాయిలో విమర్శించడంతో… జనసైనికులు కాస్తంత ఉత్సాహంగా ఈలలు వేశారు. ఒక్క జగన్నే ఇందులో చంద్రబాబును కూడా విమర్శించారు.
హైదరాబాద్‌లో ఆంధ్రులను దోపిడీదారులుగా చిత్రిస్తూ తీవ్రంగా అవమానపరుస్తుంటే ఒక్క ఆంధ్రా నాయకుడు కూడా ప్రశ్నించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోసం, ఇతర ప్రయోజనాలకోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని అన్నారు. తానేదొ గొప్పగా.. హైదరాబాద్ లో ఆంధ్రుల కోసం పోరాడినట్లు ప్రసంగించారు కానీ… అలాంటి ప్రస్తావన మాత్రం రానీయలేదు. మొత్తానికి పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మారిపోయినట్లుగా ఉంది. అది నిన్నటి వరకేనా.. రేపు కూడా ఉంటుందన్నది చూడాలి. దీనిపై… వైసీపీ నేతల స్పందన బట్టి.. మిగతా రాజకీయం ఉండొచ్చు..!