తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తు, ముహుర్తల విషయంలో…. లెక్క తప్పనీయరు. గజ్వేల్ నుంచి తాను వేయబోతున్న నామినేషన్ కు కూడా అదే ముహుర్తం పెట్టుకున్నారు. నిజానికి కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు. కాబట్టి పదిహేనో తేదీన నామినేషన్ వేస్తారనుకున్నారు. కానీ ఆ రోజున ముహుర్త బలం కలసి రాలేదు. అందుకే.. ఈ సారి సంఖ్యా శాస్త్రం కన్నా.. ముహుర్త బలాన్నే నమ్ముకుంటున్నారు. ఈ రోజు.. అంటే బుధవారం.. వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం . ఉ. 11 గం నుండి మ.1 వరకు మకర లగ్నం. మ. 1.30 నుండి 2.50 గం వరకు కుంభలగ్నం ఈ రెండు ముహూర్తాలు కేసిఆర్ కు మరో సారి రాజయోగం వస్తుందని పండితుల సూచనలు మ.2.30 నిమిషాల ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నకేసిఆర్. ఇది కేసిఆర్ తో పాటు మొత్తం పార్టీ అబ్యర్థులకు శుభం చేకూరుస్తుందని నమ్ముతున్నారు.
కేసిఆర్ లక్కీ నెంబర్ 6.. అయితే 15 న నామినేషన్ కు ముహూర్త బలం లేకపోవడంతో 14న మ. 2.30 నిమిషాలకు రెడీ అయ్యారు. 16 న అక్షయ నవమి, అష్టమి కలిసి వచ్చిన రోజు..ఇది కూడా నామినేషన్లకు మంచిదే అని చెప్పారట. కానీ ప్రచార బాధ్యతలు ఉన్నాయి కాబట్టి.. అన్నీ చూసుకుని ఈ రోజే నామినేషన్ వేస్తున్నారు. ఎప్పటిలాగే నామినేషన్లకు ముందు కూనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. కేసీఆర్ కు ఈ ఆలయం సెంటిమెంట్ కూడా. ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా నంగునూర్ మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి.. స్వామివారి పాదాలముందు నామినేషన్ పత్రాలు ఉంచి.. వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకుని నామినేషన్ వేయడం కేసిఆర్ కు ఆనవాయితి.
ప్రతి ఎన్నిక సందర్భంగా ఈ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసే ముందు ఇక్కడే నామినేషన్ పత్రాలకు పూజలు చేసి గజ్వేల్ ఆర్డివో ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఫాం హౌజ్ నుండి హెలికాప్టర్ లో కోనాయి పల్లి కి వెళ్లి.. పూజలు చేసి.. మళ్లీ అక్కడి నుండి గజ్వేల్ కు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వెళతారు.