కర్నూలులో హైకోర్టు పేరుతో అక్కడ విభజన బీజం నాటే ప్రయత్నం చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు.. కొత్తగా రైల్వేజోన్ పేరుతో ఉత్తరాంధ్ర వాసుల్లో మరింత.. విభజవాదం నాటుకునేలా చేసేందుకు రివర్స్ ఇంజినీరింగ్‌కు పాల్పడుతోంది. విజయవాడను రైల్వేజోన్గా ప్రకటించమని కోరితే.. క్షణాల్లో పని పూర్తి చేయటానికి కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ నేత పురందేశ్వరి ప్రకటించారు. ఒడిషా నుంచి విడిపోయి.. విశాఖ రైల్వే జోన్గా ఏర్పడితే అతి చిన్న జోన్‌గా మిగిలిపోతుందని ఆమె చెబుతున్నారు. అందుకోసమే విజయవాడను రైల్వే జోన్‌గా కోరితే కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటున్నారు. గతంలోనూ బీజేపీ ఇలాంటి పాచిక వేసే ప్రయత్నం చేసింది. కోస్తాకు చెందిన ఎంపీలతో.. కొన్ని ప్రకటనలు చేయించింది. కానీ చంద్రబాబు .. కొత్త సమస్యలు తెచ్చి పెట్టవద్దని.. హెచ్చరించడంతో.. అందరూ సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఎన్నికలు ముందుకొచ్చేశాయి…విభజన చట్టంలో హమీలపై ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి బీజేపీ ముందు ఉంది. అందుకే పురందేశ్వరి … రైల్వేజోన్ అంశాన్ని వివాదాస్పదం చేసి.. ప్రాంతాల మధ్య పోటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ రైల్వేజోన్ విషయంలో బీజేపీ మొదటి నుంచి ఇదే శైలిలో వ్యవహరిస్తోంది. మొదటి… ఆర్థికంగా లాభదాయకం కాదన్నారు. ఆ తర్వతా ఒడిషా అభ్యంతరం చెప్పిందన్నారు. ఒడిషా మా భూభాగంలో రైల్వే ప్రాంతాన్ని తమకే ఉంచి..ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకుంటే.. తమకేం అభ్యంతరం అని ప్రశ్నించడంతో.. కేంద్రం సైలెంట్ అయిపోయింది. అప్పట్నుంచి ప్రతి మూడు నెలలకోసారి.. రైల్వే జోన్ వస్తుందని.. ప్రకటనలు ఇవ్వడం.. ఇటు.. విష్ణుకుమార్ రాజు లాంటి నేతలు… కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ ప్రకటనలు చేయడం కామన్‌గా మారిపోయింది. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఇప్పుడు… కొత్తగా.. విజయవాడ రైల్వేజోన్ అంటూ.. పురంధేశ్వరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ జోన్ కు మద్దతుగా.. కొంత మంది కోస్తా ప్రజాప్రతినిధులెవరైనా నోరు ఎత్తితే… దాన్నే గొప్ప అవకాశంగా చేసుకుని..బీజేపీ.. రాజకీయం ప్రారంభించడానికి ప్లాన్ చేసిందని… బీజేపీ మార్క్ రాజకీయాల్ని పరిశీలించేవారికి సులువుగానే అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే.. విశాఖ రైల్వేజోన్ లేనట్లేనన్న అభిప్రాయం మాత్రం.. రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.