చిరంజీవి దృష్టంతా ఇప్పుడు`సైరా నరసింహారెడ్డి`పైనే ఉంది. ‘ఖైది నెం.150’లాంటి బ్లాక్ బ్లస్టర్ తరవాత రాబోతున్న చిరు సినిమా ఇది. ఈ సినిమా వసూళ్లకు మించి `సైరా` కోసం ఖర్చు పెడుతున్నారు. సైరా బడ్జెట్ (చిరు పారితోషికంతో కలిపి) దాదాపు రూ.200 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. హిందీలోనూ ఈ సినిమా విడుదల చేస్తారు. కాబట్టి మార్కెట్ పరంగానూ వర్కవుట్ అయ్యే ఛాన్సులు కనపిస్తున్నాయి. ఈ చిత్రానికి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. `వినయ విధేయ రామా` పనుల్లో చరణ్ బిజీగా ఉండడంతో – నిర్మాణ బాధ్యతలు కూడా చిరునే చూసుకుంటున్నాడట. అందుకే.. సెట్లో చిరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడని, తన కళ్ల ముందు దుబారా జరిగితే ఏమాత్రం సహించడం లేదని తెలుస్తోంది. ఓ సందర్భంలో దర్శకుడు సురేందర్ రెడ్డిపై చిరు సీరియెస్ అయ్యాడని, అనవసరమైన చోట కూడా ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడన్న విషయం తెలిసి.. సురేందర్ రెడ్డిని క్లాస్ తీసుకున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఒకట్రెండు సందర్భాల్లో చిరు ప్రవర్తన చూసి సురేందర్ రెడ్డి కూడా నొచ్చుకున్నాడని తెలుస్తోంది. చరణ్ సెట్లో ఉంటే మాత్రం చిరంజీవి మరే విషయాల్నీ పట్టించుకోవడం లేదని, చరణ్ కూడా కూల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని, సూరిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపు కాస్తున్నాడని, చరణ్ లేకపోతేనే… చిరు కాస్త అసహనంగా ప్రవర్తిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. అటు హీరోయిజం, ఇటు ప్రొడక్షన్ రెండు బాధ్యతలూ చూసుకోవాలంటే ఎలాంటివాళ్లకైనా ఈ మాత్రం టెన్షన్ ఉంటుంది.చిరు కూడా అలా టెన్షన్ పడుతున్నాడేమో.