బయోపిక్ అంటే… ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అయితే దానికి సినిమాటిక్ లిబర్టీ, కొన్ని వాణిజ్య అంశాలూ జోడించాలి. మరి `ఎన్టీఆర్` బయోపిక్‌లో అదే చేస్తున్నారా? నిజాల్ని దాచేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తోంది స్వయంగా ఆయన కుమారుడే కాబట్టి – ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యే ఏ విషయాన్నీ ఈ బయోపిక్‌లో చూపించరన్న విషయం రూఢీ అయిపోతోంది. ఎన్టీఆర్ ఇమేజ్‌కి, ఆయన ప్రతిష్టకూ భంగం కలిగించే విషయాలన్నీ తెలివిగా తప్పించే ప్రయత్నం చేసినట్టు టాక్.
ఎన్టీఆర్ వైవాహిక జీవితంలో కుదుపులాంటి సంగతి ఒకటి జరిగింది. బసవతారకంని పెళ్లాడి, ఇద్దరు బిడ్దలకు తండ్రయిన తరవాత కూడా… ఎన్టీఆర్ సైడ్ ట్రాక్ లో ఓ ప్రేమకథ నడిపారన్న సంగతి ఆయన అభిమానులు సైతం ఒప్పుకుంటారు. ఓ కథానాయికతో ఎన్టీఆర్ చాలా చనువుగా ఉండేవారని, ఓ దశలో ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని, పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తరవాత… బసవరతారం తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పడంతో ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని అప్పట్లోనే కథలు కథలుగా చెప్పుకున్నారు. `ఎన్టీఆర్` బయోపిక్‌లో ఈ సంగతి కూడా ప్రస్తావించాలని చూశార్ట. అది కూడా ఎన్టీఆర్ ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలిగించకుండా, నిజానికి ఆ రోజుల్లో ఏం జరిగింది? ఎన్టీఆర్ ఎందుకలా ప్రవర్తించాల్సివచ్చింది? అనే విషయాల్ని చెప్పాలనుకున్నార్ట. కానీ… సదరు కథానాయిక బంధువులు అభ్యంతరం చెప్పడంతో స్క్రిప్టు లోంచి ఆ సన్నివేశాన్ని తొలగించినట్టు సమాచారం అందుతోంది. సో.. ఎన్టీఆర్ ప్రేమ వ్యవహారం లేకుండా ఎన్టీఆర్ సినిమా పూర్తయిపోయిందన్నమాట.