పవన్ కల్యాణ్.. ఎవరు..? ఓ కొత్త తరం రాజకీయ నాయకుడు. నైతిక విలువల గురించి అనర్గళంగా అరగంట సేపు ప్రసంగించగలరు. కానీ అందులో విలువలు ఉంటాయా..? నైతికత ఉంటుందా..? అన్న ప్రశ్నలు వేసుకోకుండా.. నోరు తెరిచి అలా వింటూ ఉండాల్సిందే. అందులో.. తాట తీస్తా.. తోలు తీస్తా.. అనే పదాలు… ప్రారంభదశలో ఓ మాదిరి పిచ్‌లో వినిపిస్తాయి. ప్రసంగం సాగే కొద్దీ.. పిచ్ పెరుగుతుంది.. దానికి తగ్గట్లుగానే భాషా ప్రావీణ్యం అంతకు అంతకు పీక్స్‌కు చేరుకుంటుంది. ప్రతి సభలోనూ.. ఇవి కొత్త కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. తాజాగా.. జరుగుతున్న సభల్లో… పుట్టుకల గురించి చర్చించే స్థాయికి చేరింది. ఇష్టం లేని రాజకీయ నేతల ఇళ్లని అమ్మల్ని కూడా.. రోడ్డు మీదకు తీసుకొచ్చి… విమర్శించడం ప్రారంభించేశారు.
ఇతర పార్టీల నేతల అమ్మల్ని ఎలా అంటావు పవన్..?
కొద్ది రోజుల క్రితం.. ఎవరో జూనియర్ ఆర్టిస్టుకు ఎక్కువ… క్యారెక్టర్ ఆర్టిస్టుకు తక్కువ అన్నట్లు ఉండే.. ఓ నటి .. తనపై తిట్టిన ఓ తిట్టును పట్టుకుని.. అదంతా… మీడియానే చేయించిందని.. ఆ మీడియా వెనుక లోకేష్ ఉన్నాడని.. చెలరేగిపోయిన పవన్ కల్యాణ్.. అందులో తాను వెదుక్కున్న రాజకీయం..” అమ్మను తిట్టడం..”. తన అమ్మను డబ్బులు ఇచ్చి తిట్టించారని.. ఎవరూ అడగకపోయినా.. అందరూ మర్చిపోయినా గుర్తు చేసి..మరీ గుండెలు బాదుకున్నారు. మరి పవన్ కల్యాణ్ ఇప్పుడేం చేశారు. ఇష్టం లేదని.. తెలుగుదేశం పార్టీ నేతలందరి పుట్టుకలపైనా ప్రశ్నలు వేసేస్తారా..? . అమ్మ మెగుళ్లంటూ.. అడ్డంగా.. తిట్టేస్తారా..? . సినిమాల్లో కూడా.. సెన్సార్ చేసే మాటల్ని… ప్రజల ముందు బహిరంగంగా మాట్లాడేస్తారా..?
రాజకీయ విమర్శలంటే కుటుంబాన్ని బజారుకీడ్చడమా..?
రాజకీయ దిగజారిపోతున్న విలువల గురించి తెగబాధపడిపోతూ.. .. ఇంత వరకూ.. ఏ రాజకీయ నాయకుడు కూడా బహిరంగసభల్లో వాడటం… కొత్త రాజకీయమేమో..? జన సైనికులు.. సోషల్ మీడియాలో.. తమకు ఇష్టం లేని రాజకీయ నేతల మీద ప్రయోగిచే భాషను… పవన్ కల్యాణ్ ఇప్పుడు నేరుగా… ప్రయోగిస్తున్నారు. అందరూ.. నాయకుడ్ని చూసి నేర్చుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. తన ఫ్యాన్స్‌ను చూసి నేర్చుకుంటున్ననట్లుగా ఉన్నారు. అమ్మను తిట్టిస్తున్నారు.. ఆడ పడుచుల్ని అంటున్నారని.. గింజుకుంటున్నప్పుడు… మరి అదే నోటితే.. పవన్ కల్యాణ్.. ఏ సంబంధం లేని వాళ్లను కూడా.. ఎందుకు.. దారుణంగా తిడుతున్నారు. ..?. రాజకీయంగా విమర్శలు చేయాలంటే.. దానికి చాలా మార్గాలున్నాయి. దానికి వ్యక్తిగతంగా కుటుంబంలోని వాళ్లను తిట్టడం ఎందుకు..?
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది..!
రాజకీయాల్లో ఉండాల్సింది ఆవేశం కాదు.. అంతకు మించి ఆలోచన. ఫీలింగ్స్‌ను ఎంతగా నిగ్గబట్టుకుని.. ఎంత సంక్షోభ సమయంలో అయినా ప్రశాంతంగా ఆలోచిస్తారో.. వారే విజయం సాధించగలుగుతారు. అంతే కానీ.. అవసరం లేని దానికి… ఉన్న దానికి… గుండెలు బాదుకుని.. ఇష్టం లేని వారిపై తిట్లు లంకించుకుంటే.. అది రాజకీయం అయిపోదు. సినిమా స్టార్ ను కాబట్టి.. తనకు కొంత కులం బలం ఉంది కాబట్టి తను ఎక్కడికి వెళ్లినా .. కొంత మంది కుర్రాళ్లు వస్తారు కాబట్టి.. తానే గొప్ప.. తాను ఏం చేస్తే.. అదే రైట్ అనుకునే… మాయలో ఉంటే మాత్రం.. కళ్లు తెరిపించుకోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. ఇలానే మాట్లాడుతూ.. పోతే.. తన బలం అనుకునేవాళ్లు కూడా… దగ్గరకు తీసే పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో అనాదిగా ఇదే జరుగుతోంది. పవన్ కల్యాణ్‌కు జరుగుతుంది. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది.
— సుభాష్