వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనపై జరిగిన దాడి వెనుక.. చంద్రబాబు స్కెచ్ ఉందని.. ఇరవై రోజులుగా సాక్షి పేపర్ పరిశోధించిన రాసిన కథనాలన్నింటినీ..క్రోడీకరించి… తొలిసారి పార్వతిపురంలో జగన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో రక్తపు మరకలున్న చొక్కాను కోర్టుకు సమర్పించాలంటూ సమన్లు జారీ అయ్యాయి. దాడి ఘటనలో కీలక సాక్ష్యమైన చొక్కాను ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలోపు అందజేయాలని విశాఖ ఏడో మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జగన్‌ను ఆదేశించింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ పోలీసులు.. సీఆర్పీ సెక్షన్ 91 ప్రకారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రక్తపు మరకలున్న చొక్కాను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి.. కోడి కత్తితో దాడి చేసిన తర్వతా అర సెంటిమీటర్ గాయం అయింది. ఆ మేరకు.. కొంత రక్తం కాలిందని.. ఆ రక్తం చొక్కాకు అంటినట్లు దృశ్యాలు బయటకు వచ్చాయి. వెంటనే.. దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న.. జగన్ తో పాటు ఉన్న వ్యక్తులు.. సీఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించారు. వాళ్లు విశాఖ పోలీసులకు అప్పగించారు. కానీ… అక్కడ వైసీపీ నేతలు అతి తెలివి ప్రదర్శించారు. దాడి చేసినట్లుగా భావిస్తున్న కోడి కత్తిని.. అలాగే.. జగన్ మార్చుకున్న చొక్కాను… మాయం చేశారు. పోలీసులు గట్టిగా అడిగితే.. క్లీన్ గా ఉన్న కత్తిని బొత్స మేనల్లుడు… గంట తర్వాత తీసుకొచ్చి ఇచ్చారు. చొక్కా గురించి అడిగితే తెలియదన్నారు. అంటే… రక్తపు నమూనాలున్న చొక్కా ఇవ్వలేదు. కత్తిపై ఉన్న రక్తపు మరకల సాక్ష్యాన్ని కూడా… తుడిపేశారు. చూడబోతుంటే.. వైసీపీ నేతలు పక్కా ప్లాన్‌తోనే ఇదంతా చేసినట్లు ఉన్నారు.
ఆ తర్వాత ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ.. విచారణకు.. ఎవరూ సహకరించడం లేదు. అటు జగన్ .. ఇటు జగన్ తో పాటు ఉన్న ప్రత్యక్ష సాక్షులెవరూ.. ఏపీ పోలీసులకు సహకరించడానికి అంగీకరించడం లేదు. సాక్ష్యాలు మాయం చేశారు.. పోలీసులను నమ్మడం లేదు. అంటే.. కేసును బలహీనం చేయడానికే .. తమ వంతు ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రక్తపు మరకలున్న చొక్కాను… జగన్ ఇస్తారా..? లేదని చెబుతారా..? లేదని చెబితే కోర్టు ఏమంటుంది..? సాక్ష్యాలను మాయం చేసిన కోణంలో కేసు పెట్టమంటుందా..? ఇవన్నీ కొత్తగా వస్తున్న అనుమానాలే.