‘నెక్ట్స్ ఏంటి?’ టీజర్‌లో, ట్రైలర్‌లో ప్రేక్షకులు చూసింది కొంతే… సినిమాలో అంతకుమించి అనేలా సన్నివేశాలు వున్నాయట! సందీప్‌కిషన్, తమన్నా, నవదీప్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా న్యూఏజ్ అడల్డ్ కామెడీగా రూపొందిందని టాక్! ఏమాటకామాటే చెప్పుకోవాలి… ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ బోల్డ్‌గా వున్నాయి. హిందీ దర్శకుడు కునాల్ కోహ్లీ కాస్త క్లాస్‌గా రొమాంటిక్ సన్నివేశాలను, బోల్డ్ డైలాగులను చూపించారు. సినిమాలో అంత కంటే బోల్డ్ సన్నివేశాలను, డైలాగులు వున్నాయని తెలుస్తుంది. ప్రేక్షకులను ముందుగా ప్రిపేర్ చేయడం కోసం ఈ టీజర్, ట్రైలర్స్ విడుదల చేయడం వంటివి. తమన్నా హాట్ హాట్‌గా కనిపించిన సినిమాలు చాలానే వున్నాయి కానీ… హాట్ సినిమా చేయడం మాత్రం ఇదే మొదటిసారి! ఆమె క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ హిందీ సినిమాల్లో హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా వుంటుందట! హిందీలో రణవీర్ సింగ్, వాణీ కపూర్ నటించిన ‘బేఫికర్’ తరహాలో ‘నెక్ట్స్ ఏంటి?’ తీశార్ట! ఆల్రెడీ ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ పట్ల యూనిట్ హ్యాపీగా వుంది. ఎందుకంటే… సినిమా జానర్ ఏంటనేది ప్రేక్షకుల్లోకి వెళ్లింది. రెగ్యులర్‌గా ఈ జానర్ సినిమాల్లో వున్నట్టే… ‘నెక్ట్స్ ఏంటి?’ క్లైమాక్స్‌లో సందేశం వుండటం ఖాయం. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.