ప్రజల వద్ద నుంచి వేల కోట్లు డిపాజిట్లు వసూలు చేసిన.. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు వారితో మైండ్ గేమ్ ఆడుతోంది. విజయవాడ – గుంటూరు మధ్య ఉన్న హాయ్ ల్యాండ్.. అగ్రిగోల్డ్ దే. ఈ ఆస్తిని ఏపీ ప్రభుత్వం వేల జాబితాలో పెట్టింది. ఆయితే .. చాలా రోజుల తర్వతా.. హాయ్ ల్యాండ్… అగ్రిగోల్డ్‌ది కాదని.. వాదించింది. కోర్టు కూడా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు. . ఇటీవలి కాలంలో బీజేపీ.. అగ్రిగోల్డ్ వ్యవహారంపై దీక్షలు చేశారు. మరో వైపు .. కేంద్రంలోని పెద్దలతో… బెదిరించి.. టేకోవర్ చేసుకోకుండా.. జీఎస్సెల్ కంపెనీని తరమిశారని ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలోనే హాయ్‌లాండ్ తమది కాదంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే హాయ్ ల్యాండ్ వారిదేనని చెబుతూ.. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. ఓ నివేదిక విడుదల చేశారు. దీంతో.. హఠాత్తుగా హాయ్‌ల్యాండ్ యజమాన్యం మేలుకుంది.
అగ్రిగోల్డ్ కు సంబంధించిన హాయ్ ల్యాండ్ ఆస్తులు వారివి కాదంటూ కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆసంస్థ యాజమాన్యం, హాయ్ ల్యాండ్ తరపున న్యాయవాది జయప్రకాష్ కొత్తగా ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. హాయ్ ల్యాండ్ ప్రాపర్టీ మెసెర్స్ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉందని, ఈ సంస్థ అగ్రిగోల్డ్ సంస్థలో ఒక భాగమని లిఖితపూర్వకంగా నవంబర్ 16వ తేదీన రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టుకు తెలియచేశారు. హాయ్ ల్యాండ్ తమకు సంబంధం లేదని ఎప్పుడూ తెలపలేదని, లోపల తమ ఆధ్వర్యంలోనే పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేసినట్లు కూడా వివరించినట్లు చెప్పారు.
హాయ్ ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపుదేనిఎండీ అల్లూరు వెంకటేశ్వరరావు ప్రకటించారు. తాము హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌ను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. నిజానికి వక్రీకరణే జరిగితే.. ఆదే రోజు.. ఈ విషయాన్ని చెప్పి ఉండేవారు. మూడు, నాలుగు రోజుల పాటు.. వెయిట్ చేసి ఇప్పుడు కొత్తగా ప్రకటించాల్సిన అవసరం ఉండేదికాదు. మొత్తానికి అగ్రిగోల్డ్ ఆస్తుల కేంద్రంగా…ఏదో గూడుపుఠాణి అయితే జరుగుతోంది. దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం.. ఎవరికీ అంతుపట్టకుండా ఉంది.