యువ హీరో తనీష్ చేసిన సినిమాల గురించి పక్కనబెడితే..బిగ్ బాస్-2తో మాత్రం ఈ మధ్య కాస్త గుర్తింపును దక్కించుకున్నాడు. దీనిని క్యాష్ చేసుకోవాలనుకున్నారో ఏమో తనీష్ నటించిన రంగు అనే ఓ చిత్రాన్ని ఒక్కసారిగా బయటకు తీశారు. విజయవాడకు చెందిన లారా అనే రౌడీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలో విడుదలకానుంది. ఇటీవల వివాదాల వల్ల ఈ సినిమా వార్తల్లో నిలిచింది. తమ అనుమతి లేకుండా సినిమా తీశారంటూ సదరు లారా బంధువులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కాంట్రవర్సీస్ ఎలా వున్నా..రంగు చిత్రం తన సినీకెరీర్‌కు కొత్త రంగులద్దుతుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నారు తనీష్. బిగ్ బాస్-2తో వచ్చిన క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుదందని, తన కెరీర్ గాడిన పడుతుందని తనీష్ నమ్ముతున్నారు. నిర్మాతలు కూడా అదే నమ్మకంతో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇదిలావుండగా ఈ సినిమాపై బిగ్‌బాస్-2 విజేత కౌశల్ కూడా ఓ నజర్ వేశాడని తెలుస్తోంది. బిగ్‌బాస్-2 విన్నర్‌గా కౌశల్ తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నాడు. అతనితో సినిమాలు తీయాలని కూడా కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ తనీష్ చిత్రం రంగు ఆడియెన్స్‌కు రీచ్ అయితే, కౌశల్‌ను కూడా హీరోగా ప్రమోట్ చేసుకోవచ్చనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. మొత్తమ్మీద రంగు తో తనీష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.