వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కోడి కత్తి కేసు… సంకటంగా మారింది. ఏం చేయాలో అర్థం కావడం లేదని.. ఆయన ఆ కేసులో.. తప్పించుకు తిరుగుతున్న వైనమే స్పష్టం చేస్తోంది. వాంగ్మూలం ఇవ్వాలంటూ…స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. ఆయనకు సమన్లు పంపింది. విశాఖలో తనపై దాడి జరిగిన తర్వాత… హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ.. స్టేట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా చట్టం ప్రకారం.. వాగ్మూలం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. దానికి కూడా ఆయన… తన లాయర్ ద్వారా సమాధా పంపారు. మరింత గడువుకోరారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడికి సంబంధించి…రిట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ తర్వాత వాంగ్మూలం ఇస్తానన్న జగన్ లాయర్ ద్వారా చెప్పించారు. ఈనెల 27న హైకోర్టులో రిట్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
స్వతంత్ర సంస్థ లేదా ధర్డ్ పార్టీ విచారణ కోసం.. జగన్మోహన్ రెడ్డి.. ఈ రిట్ పిటిషన్ ను హైకోర్టులో వేశారు. దర్యాప్తు తీరును హైకోర్టు తెలుసుకుంది. ఆ సమయంలో హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దాడికి గురైన వ్యక్తి పోలీసులపై నమ్మకం లేదని చెప్పడేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకపోవడంపైనా.. అదే తరహా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి… తన విధానంలో మార్పు తెచ్చుకోలేదు. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు హైకోర్టులో విచారణ కారణాన్ని చూపి సమయం అడిగారు. మరో వైపు.. దాడికి గురైనప్పుడు… వేసుకున్న చొక్కాను.. అప్పగించాలని.. ఇరవై మూడో తేదీ వరకూ కోర్టు గడువు విధించింది.. మరి దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారో..?
జగన్ తీరుపై న్యాయవర్గాలు కూడా ఆశ్చర్యం చేస్తున్నాయి. దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించకుండా… స్వతంత్ర దర్యాప్తును కోరుకుంటే… న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయని ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై.. పూర్తి నమ్మకాన్ని కోర్టులు ఉంచుతాయి. అదే పోలీసులపై.. పిటిషన్ నమ్మకం లేదంటున్నారు. ఒక వేళ హైకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించినా.. వారికి.. స్థానిక పోలీసులే సహకారం అందించారు. పూర్తిగా.. రాకేష్ ఆస్థానా నేతృత్వలోని సీబీఐ టీం రంగంలోకి దిగదని గుర్తు చేస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి.. ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారో.. ఆయనకు తలపండిన లాయర్లు కూడా ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతున్నారో.. వైసీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.