తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత పాలసీ.. ఈట్ పాలిటిక్స్.. స్లీప్ పాలిటిక్స్.. డ్రింక్ పాలిటిక్స్ టైప్. ఆయన .. ఇరవై నాలుగ్గంటలూ రాజకీయం ఆలోచిస్తూనే ఉంటారని.. ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు సర్టిఫికెట్లు ఇచ్చేస్తూ ఉంటారు. తను దావత్కు పిలిచినా దానిలో రాజకీయం ఉంటుందని… అది తప్ప..మరోకొటి ఉండే చాన్సే లేదంటారు. దశాబ్దాలుగా… ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నా.. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ పలు సందర్భాల్లో.. కేసీఆర్ ప్రసంగాలను విశ్లేషించారు. వాటిలో… కేసీఆర్.. ముందూ వెనుకా చూడకుండా ఒక్క మాట కూడా తూలరని.. ప్రతి మాటలోనూ.. తన వ్యూహం ఉంటుందని అనేక సార్లు చెప్పుకొచ్చారు. అలాంటి కేసీఆర్.. గురువారం… ప్రసంగాల్లో… ఓటమి మాటను తెరపైకి తీసుకు వచ్చారు.
ఓడిపోతే.. తనకేం నష్టం లేదని.. ఇంట్లో రెస్ట్ తీసుకుంటానని.. ఖానాపూర్లో కేసీఆర్ చేసిన ప్రకటన.. ఓ రకంగా.. తెలంగాణ రాష్ట్ర సమితికి మైనస్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కూటమికి అనుకూలంగా ఉందని.. అంతర్గతంగా జరుగుతున్న ప్రచారానికి.. కేసీఆర్ మాటలు మరింత ఊపునిచ్చినట్లవుతుంది. అయినా సరే.. కేసీఆర్ మాటలు అన్నారు. 70 స్థానాల్లో డిపాజిట్లు తెచ్చుకుంటే.. గొప్ప అనుకుంటున్న పార్టీ బీజేపీ కూడా.. గెలుస్తామని.. తొడకొడుతోంది కానీ.. ఎక్కడా ఓడిపోతే.. అన్న ఆలోచన కూడా దరి చేరనీయడం లేదు. కానీ.. కేసీఆర్ మాత్రం… ఓడిపోతే నాకేం నష్టం అంటూ… అసువుగా మాట్లాడేస్తున్నారు. ఆయన కాదు.. ఆయన కుమారుడు.. కూడా.. విద్యార్థులతో సమావేశం పెట్టి.. ఎవరూ నచ్చకపోతే.. నోటాకు ఓటేయమని సందేశం ఇచ్చేశారు.
ఓటమి మాటల ద్వారా కేసీఆర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని అనుకున్నప్పుడు… కేసీఆర్ ఇలాంటి వ్యూహాలే అమలు చేస్తూంటారు. గతంలో వైఎస్ దెబ్బకు టీఆర్ఎస్ పతనావస్థకు చేరినప్పుడు.. టీఆర్ఎస్లో తిరుగుబాటు వచ్చింది. అప్పుడు.. తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన సన్నిహితులు.. బతిమాలి, బామాలి.. పీఠంపై కూర్చొబెట్టారు. అదంతా ప్లాన్డ్ గా జరిగిపోతుంది. పార్టీలో మళ్లీ పట్టు వస్తుంది. ఆ వ్యూహంలోనే తాను ఓడిపోతున్నానని ఫీలింగ్ తెప్పించి.. సానుభూతి పెంచుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ విషయంలో ముందు ముందు జరిగే పరిణామాలను బట్టి కేసీఆర్ ఓటమి మాటల్ని ఎందుకు మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది.