కడడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షన్ రాజకీయం చేస్తోంది. రెండు ప్రధాన వర్గాలైన రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ఇద్దరూ టీడీపీలో ఉండటంతో ఇటీవలి కాలంలో… అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ప్రశాంతతం ఉంటే… తమకు కష్టమని… వైసీపీ నేతలు… టీడీపీ నేతల్లో ఉండే.. వర్గ విబేధాలను అడ్డం పెట్టుకుని ఫ్యాక్షన్ గొడవలు రేపడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఆధిపత్యంలో ఎనిమిది గ్రామాలు ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. అక్కడ ఆదినారాయణరెడ్డికి అనుకలంగా ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుంది.
ఆ ఎనిమిది గ్రామాలపై వైసీపీ నేతలు కన్నేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి.. ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి .. తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని భావిస్తున్న ఆ ఎనిమిది గ్రామాల్లోని కొంత మందిని… గుర్తించారు. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గొరిగనూరు అనే ఊళ్లో… వైసీపీ నేతలు చేరిక కార్యక్రమాన్ని పెట్టారు. కడప నుంచి.. కొన్ని వందల మందితో ర్యాలీగా ఆ గ్రామానికి వెళ్లి వారిని పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ వేశారు. అంత చిన్న గ్రామానికి అంత మంది వెళ్తే గొడవలు అవుతాయని పోలీసులు ఆపేశారు.
వైసీపీ నేతలకు కావాల్సింది అదేనన్నట్లుగా రెచ్చిపోయారు. ఫలితంగా మూడు రోజుల నుంచి జమ్మలమడుగు మొత్తం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వందల సంఖ్యలో పోలీసులు నేతల ఇళ్ల ముందు పహారా పెట్టారు. ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న గ్రామాల్లో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లో పట్టు సాధించేందుకు వైసీపీ ప్రధానంగా ఉద్రిక్తతల అంశాన్నే వాడుకుంటోంది.