తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోబోతోందన్న అభిప్రాయాన్ని అంతటా మెల్లగా వ్యాపింప చేయడంలో..ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణది ఓ ప్రత్యేకశైలి. ఆయన వారం వారం రాసే కొత్త పలుకులో.. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు.. ఏ విధంగా చూసినా.. టీఆర్ఎస్కు 80 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి వారానికి పది సీట్ల చొప్పున కోత వేసుకుంటూ వస్తున్నారు. ఈ వారం.. మొత్తం అయిపోయిందని… చెప్పి.. కేసీఆర్ ఓటమికి.. పోస్ట్‌మార్టం అన్నట్లుగా కొత్తపలుకులో అభిప్రాయాలను రాసుకొచ్చారు. ఈ వారం కొత్త పలుకులో.. కేసీఆర్ ఓటమికి కారణం ఆయన స్వంయంకృతాపరాథం.. మొండితనమే కారణమని తేల్చారు.
గత కొన్ని వారాలుగా.. తెలంగాణ ఎన్నికల ప్రస్తావన వస్తే.. రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తే.. మొదటగా.. ఆర్కే చెప్పిన మాట.. తెలుగుదేశం పార్టీతో.. టీఆర్ఎస్ పొత్తుకు అంగీకరించి ఉన్నట్లయితే.. ఏకపక్షంగా ఎన్నికలు జరిగిపోయేవి. కానీ.. ఆయన వేరే ఉద్దేశంతో.. టీడీపీతో పొత్తుకు అంగీకరించకపోవడం వల్ల.. ఇప్పుడు.. అధికారాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారని.. ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో కానీ.. తెలుగుదేశం పార్టీతో.. కేసీఆర్ పొత్తుకు అంగీకరించకపోవడం అన్నదే… తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజీకీయాల్లోనే కీలక మలుపు అన్నట్లుగా.. ఆర్కే చెబుతున్నారు. కేసీఆర్ .. టీడీపీని దూరం పెట్టడం వల్లేనే.. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిశారని.. అదే ఎఫెక్ట్‌తో కేంద్రంతోనూ కలిశారని.. ఫలితంగా.. తెలంగాణలో.. అటు దేశంలోనూ.. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడిందనన్నారు.
కేసీఆర్‌కు “అరె.. ఒరే” అనుకునేంత స్నేహం.. ఆర్కేకి ఉందని రాజకీయవర్గాలు చెప్పుకుంటాయి. బహుశా ఈ చొరవతోనే.. ఎన్నికలకు ముందు…టీడీపీతో పొత్తు కోసం.. ఆయన ప్రయత్నించి ఉంటారు. దాన్ని… కేసీఆర్ తిరగ్గొట్టడంతోనే.. ఇప్పుడు.. తన సలహా పాటించకపోవడం వల్ల అధికారం కోల్పోతున్నావనని.. తన వ్యాసాల ద్వారా.. కేసీఆర్‌కు… ఆర్కే తెలియజెబుతున్నట్లుగా ఉంది. ఎటూ తిరిగినా.. చివరికి… కేసీఆర్ ఓడిపోబోతున్నారని మాత్రం … అంతర్లీనంగా కుండబద్దలు కొడుతున్నారు. మరి ఫలితం అలాగే ఉంటుందా..?