కేసీఆర్కు ఎదురుందా..? ఈ ప్రశ్న.. గత రెండు వారాల కిందటి వరకూ.. తెలంగాణలో గట్టిగానే వినిపించేది. రాజకీయ దురంధరుడు అయిన కేసీఆర్ ను ఢీకొట్టే.. తెలంగాణ నేత లేరని… చెప్పుకున్నారు. ఏ విధంగా చూసినా.. ఆయనదే గెలుపన్న వాదనలు.. బలంగా వినిపించాయి. కానీ.. ఈ రెండు వారాల్లోనే పరిస్థితి మారిపోయింది. సాక్షాత్తూ.. కేసీఆరే.. “ఓడిపోతే.. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా.. నాకేం నష్టం” అంటూ.. కాడి దించేసినంత పని చేశారు. అంటే… ప్రజాభిప్రాయం తేడాకొట్టినట్లుగానే డిసైడయినట్లుగా అందరూ భావిస్తున్నారు.
నిజానికి తెలంగాణలో పరిస్థితి అంత తీవ్రంగా ఉందా..? రెండు నెలల్లోనే బయటకు వచ్చిందా..? అంటే.. రెండింటికి అవుననే చెప్పాలి. మీడియాను గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్ .. తన పాలన సూపర్ అంటూ స్వయం కితాబులు ఇప్పించుకున్నారు కానీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో.. ఎప్పుడూ అంచనా వేసుకునే ప్రయత్నం చేయలేదు. తన మనసకు నచ్చే రాతలు, గీతలు ఇచ్చే సర్వే సంస్థల మాటలు నమ్మి.. అంతా బాగుందని.. నట్టేట మునిగే పరిస్థితి తెచ్చుకున్నారు. నిజానికి తెలంగాణ ప్రజల్లో మొదటి నుంచి అసంతృప్తి ఉంది. దాన్ని మీడియా బయటపడనీయలేదు. కేసీఆర్ కు బాకా ఊదడానికి ప్రాధాన్యం ఇచ్చారు. నయానో భయానో.. మీడియా మొత్తం కేసీఆర్ గుప్పిట్లో ఉంది. ఫలితంగా.. నిజాలు బయటకు రాలేదు. ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. అభ్యర్థులు ప్రచారంలో భాగంగా గ్రామాలల్లోకి వెళ్తున్నప్పుడు.. అసలు సెగ అంటే ఏమిటో తెలిసొస్తోంది.
వందసీట్ల పేరుతో గెలిచే పార్టీగా ప్రజల్లో ఎంతో నమ్మకం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రజాకూటమి ఏర్పాటుతో.. ప్రత్యామ్నాయం ఉందన్న అభిప్రాయం ప్రజలకు వచ్చింది. ఫలితంగా కేసీఆర్ తప్ప.. మరో నేత లేడు అనుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సహా.. అనేక మంది … బలంగా కనిపిస్తున్నారు. అందుకే…. గెలిచే పార్టీ ట్యాగ్.. టీఆర్ఎస్కు ఎప్పుడో పోయింది. అది ఉంటనే.. తటస్థుల ఓట్లు లభిస్తాయి. ప్రజాకూటమికి అడ్వాంటేజ్ ఉందన్న భావన వస్తే.. ఆ కూటమికే ఓట్లు వెళ్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా.. ఎన్నికల సంఘం రూల్స్ అమల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ స్థాయిలో పెద్దల ఒత్తిళ్లతో పెట్టి.. ఓ జాతీయ మీడియా సర్వేను కూడా ప్రకటించుకున్నారు. కానీ.. ఆ సర్వే ఎఫెక్ట్ .. ఇసుమంత కూడా లేదు. ఫలితం ఏమిటో మాకు తెలియదా అన్నట్లుగా.. జనాలు ఉన్నారు. అంటే.. తమ తీర్పుపై.. ప్రజలకు క్లారిటీ వచ్చేసిందన్నమాట..!