నాని ద్విపాత్రాభినయం చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’తో షైన్ స్ర్కీన్స్ సంస్థ ప్రయాణం ప్రారంభమైంది. నిర్మాతలుగా సాహూ గారపాటి, హరీశ్ పెద్ది తొలి చిత్రమది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్పందన రాకున్నా… విడుదలకు ముందు సినిమాను అవుట్‌రేట్‌కు ‘దిల్’రాజు కొని, ఆయనే పంపిణీ బ్యూట్ చేయడంతో నిర్మాతలకు లాస్ రాలేదు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మజిలి’ టైటిల్ పరిశీలనలో వుంది. ఈ సినిమా తర్వాత ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా… ది గ్రేట్’ సినిమాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్ర్కీన్స్ నిర్మాతలుగా సాహూ గారపాటి, హరీశ్ పెద్ది ఒక సినిమా చేయనున్నారు. ఆల్రెడీ అనిల్‌కి అడ్వాన్స్ ఇచ్చారట! ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్2’కి అనిల్ దర్శకత్వం వహిస్తున్నారు. తరవాత బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నారు. బాలకృష్ణ సినిమా తరవాత ‘షైన్ స్ర్కీన్స్’లో అనిల్ సినిమా చేస్తారో? లేదా బాలకృష్ణ సినిమాను ఆ సంస్థలో చేస్తారో?