తన కంపెనీలు రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగ్గొట్టలేదని.. తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశాలతోనే.. తనపై బురద జల్లుతున్నారని స్ఫష్టం చేశారు. డమ్మీ కంపెనీల పేరుతో.. తనవి కాని కంపెనీలను తనకు అంటగట్టిగా… దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం నేరమా అని ప్రశ్నించారు. ఈడీ సోదాలు అనంతరం..విడుదల చేసిన ప్రెస్ నోట్లో బ్యాంకులకు రూ. 5,700 కోట్లు ఎగ్గొట్టినట్లుగా వెల్లడించింది. సుజనాకు 125 బినామీ కంపెనీలున్నాయని.. వాటిపై.. వేల కోట్ల రుణాలు తీసుకున్నారని కట్టడం లేదని… ఆ కంపెనీలన్నంటినీ సుజనానే నడిపిస్తున్నారని ఈడీ అధికారులు మీడియాకు వెల్లడించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు సుజనా చౌదరి మీడియా ముందుకు వచ్చారు.
ప్రజా జీవితంలో ఉన్నందునే.. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి వచ్చానన్న సుజనా చౌదరి… తను కానీ.. తన కంపెనీలు కానీ.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తన కంపెనీలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు మొత్తం ఇస్తానని.. తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటేనే వాటిని ఎగ్గొట్టినట్లు ప్రచారం చేయడేమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంకులు రుణాలు.. ఏ తనఖా పెట్టుకోకుండా ఇవ్వవని.. ఇరవై చోట్లకిపైగా స్థిరాస్తులు బ్యాంకులకు తనఖా పెట్టి లోన్లు తీసుకున్నామన్నారు. తన కంపెనీలు కొన్నాళ్ల నుంచి నష్టాల్లో ఉన్న మాట నిజమేనని.. రుణాల చెల్లింపులపై ఇప్పటికే బ్యాంకులతో.. తమ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయన్నారు. ఈడీ అధికారుల ప్రెస్ నోట్ పూర్తిగా.. రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీయడానికే అన్నట్లుగా ఉందని.. సుజనా చౌదరి అన్నారు. మీడియా కూడా.. ఇష్టం వచ్చినట్లు ..నిజానిజలు తెలుసుకోకుండా… వార్తలు ప్రసారం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తనకు సంబంధించివి కానీ.. తన కంపెనీలకు సంబంధించిన సమాచారం కావాలంటే.. మొత్తం ఇస్తామని.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి అవకతవకలు ఏమైనా ఉంటే రాయాలన్నారు. అంతే కానీ.. తెలిసి తెలియని సమాచారంతో బురదజల్లే ప్రయత్నం వచేయవద్దని మండిపడ్డారు. ఈడీ బినామీల పేర్లతో ఉన్నాయంటూ.. సీజ్ చేసిన ఆరు కార్లు .. తన కుటుంబ సభ్యుల పేర్ల మీదేనే ఉన్నాయి. కుటుంబసభ్యుల పేర్ల మీద ఉంటే.. బినామీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆ కార్లకు సంబంధించిన పత్రాలు… మీడియాకు ఇచ్చారు.
కొసమెరుపేమిటంటే.. ఈడీ నుంచి సమన్లు వచ్చాయని… ఆయనను విచారించి… అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ.. సుజనా చౌదరి మాత్రం.. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. విచారణ కోసం.. రమ్మని అడిగారని.. పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి.. అవి అయిపోయిన తర్వాత వస్తానని చెప్పానని.. దానికి ఈడీ అధికారులు అంగీకరించారంటున్నారు. మరో వైపు.. సుజనాపై.. విపక్ష నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ టీడీపీ మాత్రం.. సుజనా చౌదిరికి మద్దతుగా నిలిచింది. కేందరంపై పోరాడుతున్నందుకే.. కేంద్రం కక్ష సాధింపు చతర్యలు చేపడుతోందని మండి పడ్డారు.