ఐపీఎస్ ఉద్యోగానికి స్వచంచ పదవి విరమణ చేసిన.. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ.. లోక్‌సత్తా పార్టీ బాధ్యతల్ని తీసుకున్నారు. రాజకీయాల్లోకి రావాలని … ఆయన వీఆర్ఎస్ తీసుకున్న ఆయన… ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పీపుల్స్ మేనిఫెస్టోను తయారు చేసుకున్నారు. తర్వాత.. తన మేనిఫెస్టోను అమలు చేస్తానని హామీ ఇచ్చే ఏదైనా పార్టీలో చేరాలనుకున్నారు. ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ స్వాగతం పలికాయి. కానీ.. ఆయన రెండింటిలో చేరడానికి సిద్ధపడలేదు. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన చేశారు. వందేమాతరం, జనధ్వని పేరుతో పార్టీ పెట్టాలనుకున్నప్పటికీ.. మనసు మార్చుకున్నారు.. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పార్టీ .. లోక్‌సత్తాలో చేరారు. ఆ పార్టీకి ఇక.. వీవీ లక్ష్మినారాయణనే నడిపించనున్నారు. సలహాదారునిగా ఉత్తమ్ వ్యవహరించే అవకాశం ఉంది.
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా ఐఏఎస్ అధికారి. ఆయన తన పదవికి రాజీనామా చేసిన.. లోక్‌సత్తాను స్థాపించారు. అయితే కేవలం ఉద్యమ సంస్థగానే ఉంది. ప్రజల్లో విభిన్నమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యమిచ్చారు. 2009లో.. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ ఎన్నికల్లో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసినా.. కూకట్‌పల్లిలో ఒక్క జేపీ తప్ప.. ఇంకెవరూ గెలవలేకపోయారు. రెండు నుంచి మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. 2014లోనూ.. లోక్‌సత్తా ఎన్నికల్లో పోటీ చేసినా.. ఎక్కడా ప్రభావం చూపించలేకపోయారు. ఆ తర్వాత పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయి.. చీలకల వ్యవహారం వరకూ వచ్చింది. దాంతో రాజకీయ పార్టీని రద్దు చేసుకుంటున్నట్లు జేపీ ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ మాజీ జేడీ నడపనున్నారు.
.
రాజకీయాలపై లోక్‌సత్తా అధినేత జేపీతో లక్ష్మీనారాయణ ఆదివారం సుదీర్ఘమైన చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిస్థితులపై సోమవారం మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో ఆయన చర్చించారు. చివరకు లోక్‌సత్తాలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.