టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రతి సభలోనూ.. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. ఆయన పెత్తనం మనకు అవసరమా అంటూ ప్రశ్నిలు గుప్పిస్తూ.. సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తను చేసిన అభివృద్ధి పనుల కన్నా.. ఎక్కువగా.. ఈ మాటలే చెబుతున్నారు. కేసీఆర్ ఈ వ్యూహం అమలు చేస్తున్నప్పుడే.. చంద్రబాబు, రాహుల్ గాంధీ సంయుక్తంగా రోడ్ షోలకు సిద్ధమయ్యారు. రాహుల్, చంద్రబాబు రోడ్ షోలు చేసినా.. చేయకపోయినా.. కేసీఆర్ మాత్రం.. చంద్రబాబును టార్గెట్ చేస్తూనే ఉంటారు.
సెంటిమెంట్ రగిలించడమే కేసీఆర్ వ్యూహమా..?
కేసీఆర్ రాజకీయ వ్యూహం సెంటిమెంట్‌ను రగిలించడం. సెంటిమెంట్ రగిలించాలంటే… చంద్రబాబను విమర్శించాలి. సమరం.. చంద్రబాబు – కేసీఆర్ మధ్య జరుగుతున్నట్లు.. ఆంధ్రా పార్టీకి.. తెలంగాణ పార్టీకి మధ్య పోటీ జరుగుతున్నట్లుగా… క్రియేట్ చేయాలన్నది కేసీఆర్ ప్రయత్నం అనేది క్లియర్‌గా కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ.. చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబు ఏం చేసినా.. చేయకపోయినా.. ఈ ప్రచారం చేస్తూనే ఉంటారు. వీరు చేస్తున్న ప్రచారంతో.. తాము ముందడుగు వేయకపోతే.. తమకు నష్టం అని మహాకూటమికి అర్థం అయింది. టీఆర్ఎస్ వేసిన ట్రాప్‌లో ఎందుకు పడాలి అని మహాకూటమి ఆలోచిస్తోంది. అందుకే రాహుల్ గాంధీ – చంద్రబాబు రోడ్ షో జరపడం. వీరిద్దరూ రోడ్ షోలు చేయడం ద్వారా.. ఈ రెండు పార్టీల పొత్తుల్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లినట్లవుతుంది.
ఓట్ల బదిలీ కోసమే బాబు – రాహుల్ రోడ్ షోలా..?
తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకూ బద్ధశత్రువులు. తొలి సారి పొత్తులు పెట్టుకున్నాయి. సింపుల్‌గా ఓటు ట్రాన్స్ ఫర్ కావడం అంత తేలిక కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ – టీడీపీ పొత్తులపై ఏ సర్వే చూసినా.. యాభై, ఆరవై శాతం మంది అంగీకారం తెలుపుతున్నారు. మరో ముఫ్పై, నలభై శాతం మాత్రం సంశయంతో ఉన్నారు. వీరందరి సంశయాన్ని పటాపంచలు చేస్తేనే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదే మొదటి సవాల్. పార్టీ శ్రేణులు ఐక్యతగా పని చేయడం రెండో సవాల్. ఈ రెండు పార్టీల శ్రేణులు కలసి పని చేయడానికి కారణాలు ఉంటాయి. ఈ రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరంగా చాలా కాలంగా పోరాడుతున్నారు. అంతే కాకుండా.. టిక్కెట్ రాని వాళ్లు .. సహాయ నిరాకరణ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందిని బుజ్జగించారు. మరికొంత మంది రెబల్స్ గా బరిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో… రాహుల్, చంద్రబాబు రోడ్ షోల ద్వారా… అందర్నీ ఏకతాటిపైకి తెచ్చే అవకాశం లభిస్తుంది. చంద్రబాబు, రోడ్ షో అవుతందని.. షెడ్యూల్ ఖరారయిన తర్వాత రేణుకా చౌదరి.. ఖమ్మం వెళ్లి నామా నాగేశ్వరరావు కోసం వెళ్లి ప్రచారం చేశారు. అంటే… హైకమాండ్ వచ్చే సరికి.. చాలా మంది కలుస్తారు. ఓటు ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేయడం.. పార్టీ శ్రేణులను ఐక్యం చేయడం కూడా.. రాహుల్, చంద్రబాబు రోడ్ షోలో ప్రధానం.
చంద్రబాబు ప్రచారంపై మహాకూటమి పార్టీల్లో ఆందోళన ఉందా..?
చంద్రబాబు విషయంలో తెలంగాణలో విభిన్నమైన ప్రచారం ఉంది. చంద్రబాబునాయుడు వస్తే.. మహాకూటమికి ఓట్లు తగ్గుతాయని.. పార్టీలు భావిస్తే.. అది మహాకూటమికే ప్రమాదం. పొత్తులు పెట్టుకుని.. ఇంతగా జరిగిన తర్వాత చంద్రబాబు ప్రచారం చేయకుండా ఉంటే.. కేసీఆర్ చేస్తున్న ప్రచారానికి భయపడుతున్నట్లుగా అవుతుంది. టీడీపీతో పోత్తు పెట్టుకున్నారు.. టీడీపీకి చంద్రబాబునాయుడు నాయకుడు. ఈ పొత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లి సెంటిమెంట్ పండించాలనేది కేసీఆర్ వ్యూహం. ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే. ఇక వెనక్కి పోవడానికి అవకాశం లేదు. వెనక్కి వెళ్లినా నష్టమే. ముందుకూ వెళ్లకుండా.. వెనక్కి వెళ్లకుండా.. ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుది. ఈ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి..మహాకూటమిలోఇంకా ఆప్షన్ లేదు.
ఓట్ల బదిలీ కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వాలంటే ఏం చేయాలి..?
గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు.. 33 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 25 శాతం.. టీడీపీకి పధ్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి. రెడూ కలిపిదే.. 39 శాతం అవుతాయి. అయితే టీడీపీ ఓటు బ్యాంక్ అలానే ఉందా లేదా .. అనేది తెలియదు. అదే సమయంలో సీపీఐ, టీజేఎస్ ఓట్లు కూడా కలసి వస్తాయి. టీఆర్ఎస్కు… సహజంగానే అధికారిక వ్యతిరేకత ఓట్లు రెండు, మూడు శాతం తగ్గుతాయనుకుందాం. చూస్తే.. టీఆర్ఎస్, మహాకూటమి మధ్య ఓట్లు శాతం మధ్య తేడా ఉంటుంది. ఈ గణాంకాలన్నీ.. ఆయా పార్టీల మధ్య కెమిస్ట్రీ కుదిరి…ఓట్లు ట్రాన్స్ ఫర్ అయినప్పడే మాత్రమే సాధ్యం. ఈ కెమిస్ట్రీని వర్కవుట్ చేయాడనికే… రాహుల్ – చంద్రబాబు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.