మెహరీన్.. పాపం ఈ కథానాయికకి హిట్సే లేవు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాపే. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వచ్చిన ప్రతీ అవకాశాన్నీ బంగారంలా చూసుకోవాలి. కానీ.. రివర్స్ గేర్‌లో వెళ్తోంది మెహరీన్. అడ్వాన్సు ఇచ్చిన నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది.
రిజ్వాన్ ఫిల్మ్ సంస్థ సుధీర్‌బాబుతో ఓ సినిమా చేయాలనుకుంది. కథానాయికగా… మెహరీన్‌ని తీసుకుంది. అప్పుడే రూ.30 లక్షల పారితోషికం ఖరారు చేశారు. అడ్వాన్సు కూడా ఇచ్చేసింది చిత్రబృందం. తీరా చూస్తే ఈ ప్రాజెక్టు నుంచి సుధీర్‌బాబు తప్పుకున్నాడు. చిరు అల్లుడు ఈ ప్రాజెక్టులోకి రంగ ప్రవేశం చేశాడు. దాంతో మెహరీన్ ప్లేటు ఫిరాయించింది. కల్యాణ్‌దేవ్ పక్కన నేను చేయనని, సుధీర్‌బాబుతో సినిమా అని చెప్పి, హీరో మారిస్తే ఎలా అని.. వాదిస్తోందట. అడ్వాన్సు కూడా తిరిగి ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చుంది. చిత్రబృందం మెహరీన్‌తో రాజీ ప్రయత్నాలు ప్రారంభించింది. కల్యాణ్‌దేవ్‌తో నటిస్తే.. మరింత పారితోషికం ఇస్తామని చెప్పినా మెహరీన్ ఒప్పుకోవడం లేదట. ఈ పంచాయితీ ఫిల్మ్ చాంబర్ వరకూ వెళ్లింది. మరి నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.