కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `భారతీయుడు 2`. రోబో 2.. విడుదల హడావుడి పూర్తయిన వెంటనే… శంకర్ ఈ సినిమాపై దృష్టి సారిస్తారు. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. శంకర్ – కమల్ల సినిమా కాబట్టి… మిగిలిన భారతీయ భాషల్లోనూ విడుదలవ్వడం ఖాయం. సాధారణంగా… తమిళ నటీనటులతోనే సర్దుకుపోయే శంకర్ ఈసారి కాస్త రూటు మార్చినట్టు తెలుస్తోంది. `భారతీయుడు 2`కోసం తెలుగు నుంచి కొంతమంది నటీనటుల్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా హాస్యనటుడు వెన్నెల కిషోర్‌కి భారతీయుడు 2 టీమ్ లో చోటు దక్కినట్టు తెలుస్తోంది. కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమల నుంచీ నటీనటుల్ని ఎంచుకుంటున్నాడు శంకర్. కమల్ సినిమాలో, అందులోనూ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో వెన్నెల కిషోర్‌కి అవకాశం రావడం గొప్ప విశేషమే. తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసే వెన్నెల కిషోర్.. ఇప్పుడు తమిళ ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.