” కొంత మంది సన్నాసులు.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. శాపాలు పెట్టారు. ఇప్పుడు వెకిలి, మకిలి, పిచ్చి సర్వేలు విడుదల చేస్తారు. వాటిని పట్టించుకోవద్దు..” ఇది శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారసభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఓ వైపు లగడపాటి… ఎన్నికల్లో స్వతంత్రులు ఎనిమిది నుంచి పది మంది వరకూ గెలుస్తారని.. వారి పేర్లు రోజుకు రెండు చొప్పున విడుదల చేస్తానని ప్రకటించారు. పూర్తి స్థాయి సర్వే ఫలితాలు మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత విడుదల చేస్తానని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్..లగడపాటి విడుదల చేయబోయే సర్వే ఫలితాలు.. కచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాయనే నమ్మకానికి వచ్చినట్లు ఉన్నారు. అందుకే… వెకిలి, మకిలి, పిచ్చి సర్వేలని తీసి పడేశారు. వాటిని నమ్మవద్దని కూడా.. పిలుపునిచ్చారు.
లగడపాటి రాజగోపాల్ నిజానికి ఎలాంటి సర్వేలు ప్రకటించలేదు. తాను ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి సర్వేలు ప్రకటించలేదని.. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ… తన పేరును వాడుకుని చేసినవే తప్ప.. తాను విడుదల చేసిన కావని స్పష్టం చేశారు. అయితే.. సర్వేల విషయంలో లగడపాటిది ఓ బ్రాండ్‌గా స్థిరపడిపోయారు. అందుకే ఆయన పేరును వాడుకుని రకరకాల సర్వేలు.. సర్క్యూలేట్ చేస్తూ ఉంటారు. కానీ వాటికి పెద్దగా విశ్వసనీయత లేదు. అయినప్పటికీ.. కేసీఆర్.. కచ్చితంగా లగడపాటి ప్రకటించబోయే… సర్వే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటుందని ఎలా ఫిక్సయ్యారన్న సందేహం.. టీఆర్ఎస్ వర్గాల్లో ప్రారంభమయింది. లగడపాటి పక్కా ప్రొఫెషలిజంతో… సర్వే ఫలితాలు ప్రకటిస్తారు. తను ఉన్న పార్టీకి కానీ… లేకపోతే… ఇతర పార్టీలకు కానీ ఉపయోగపడేలా ఎప్పుడూ సర్వేలు ప్రకటించలేదు. గతంలో టీఆర్ఎస్కు అనుకూలంగా సర్వేలు ప్రకటించారు కూడా. ..!
అయినప్పటికీ.. లగడపాటి సర్వేను.. నమ్మవద్దని.. పిలుపునిస్తారంటే.. కచ్చితంగా.. పరిస్థితి తేడాగా ఉందనే విషయాన్ని కేసీఆర్ అంగీకరించినట్లేనన్న భావన.. టీఆర్ఎస్ వర్గాల్లో ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో… వెలువడి సర్వేల్లో మెజార్టీ మహాకూటమి అధికారాన్ని అందుకుంటుందనే చెప్పుకొచ్చాయి. మహాకూటమికి 65 నుంచి 70 సీట్లు వస్తాయని సగటున అంచనా వేస్తున్నాయి. ఇదే తరహాలో కేసీఆర్ చేయించుకున్న సర్వేలు కూడా వచ్చి ఉంటాయని.. అందుకే ఆయన ఖండించారని.. అంటున్నారు. మొత్తానికే కేసీఆర్, టీఆర్ఎస్ వైపు నుంచి కూడా.. సర్వేలు తమకు వ్యతిరేకంగా వస్తున్న విషయాన్ని అన్యాపదేశంగా అయినా ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.