వైఎస్ఆర్సిపి నాయకురాలు రోజా పవన్ కళ్యాణ్ పై మరొక సారి విరుచుకుపడ్డారు. ఆరు వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డ సుజనా చౌదరి అక్రమాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం శోచనీయమని రోజా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీపై, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై విమర్శలు చేయకుండా కేవలం వైఎస్ జగన్ మీద పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం సరికాదని వ్యాఖ్యానించిన రోజా, ప్రజలకు అండగా నిలబడుతుంది వైఎస్ జగన్ మీద విమర్శలు మానుకోకపోతే పవన్ కళ్యాణ్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సుజనా చౌదరి పై పవన్ కళ్యాణ్ నోరుమెదపడంలేదని, ఏపీ ప్రభుత్వ విధానాలను విమర్శించడం లేదని ఈ మధ్య తరచుగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్య ఇదే తరహా వ్యాఖ్యలు వైకాపా నేత అంబటి రాంబాబు చేశారు. అలాగే ఇటీవలే పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య కూడా పవన్ కళ్యాణ్ సుజనాచౌదరి అక్రమాలపై నోరు మెదపడం లేదు ఎందుకని ప్రశ్నించారు.
అయితే వైఎస్ఆర్ సిపి నేతల విమర్శలు చూస్తున్న ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అసలు వైఎస్ఆర్ సీపీ నేతలు వార్తలు చూస్తున్నారా చూడడం లేదా, రాజకీయాలు ఫాలో అవుతున్నారా అవ్వడం లేదా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి ఎందుకంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ సుజనా చౌదరి మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడిన సంగతి తెలిసిందే ( https://www.telugu360.com/te/pawan-kalyan-fires-on-tdp-mp-sujana-chowdary-over-bank-fraud-case/ ) అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ విమర్శలు చేయని రోజు అంటూ ఈ మధ్య కాలంలో లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని, చింతమనేని లాంటి వారిని, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి ఇవన్నీ తెలిసి కూడా తిరిగినట్లు నటిస్తూ వైకాపా నేతలు ప్రకటనలు చేస్తున్నారని ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. లేదంటే ఇలా విమర్శించక పోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు పడదు అన్న భయం అయిన వారిలో ఉండి ఉండాలి.